హోమ్ /వార్తలు /తెలంగాణ /

Srikanthachary father: శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం.. పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసిన భార్య

Srikanthachary father: శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం.. పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసిన భార్య

వెంకటాచారి

వెంకటాచారి

శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు.. పొడిచెడు ముద్దు బిడ్డ శ్రీకాంతచారి (SrikanathaChaari). తన ఆత్మార్మణతో నాలుగు కోట్ల తెలంగాణ ఉద్యమ సారథులను ఒక్కతాటిపైకి తెచ్చి.. ప్రత్యేక రాష్ట్ర కలను సాకమయ్యేలా చేసిన త్యాగశీలి. ఆ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి (VenkataChaari) అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కొంత కాలంగా హయత్‌నగర్‌ డివిజన్‌ సూర్యానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీకాంతాచారి తండ్రి వెంక టచారి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ నెల 1న పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వెంకటచారి తిరిగి రాలేదు. 2వ తేదీన సోషల్‌ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ వద్ద ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్‌ చేయగా ఎత్తలేదు. వెంకటచారి ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆయన కేఏ పాల్‌ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని..

  కాగా, తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంతాచారి తండ్రి గెలిచి, మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని వెల్లడించారు. శ్రీకాంతాచారి అమరుడైన 2009 డిసెంబరు 3వ తేదీయే.. సిసలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమన్నారు.

  ఇప్పటినుంచి ఆ రోజునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. గురువారం ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరు 3న శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాల కోసం ఉచిత విద్య, వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

  ‘‘ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద నేతలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ల సహకారంతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తా’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలను అప్పుల ఊబి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీ కి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని పేర్కొన్నారు.

  ఈసందర్భంగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం మరోసారి ఉద్యమం చేస్తామని.. ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుందని వెంకటాచారి అన్నారు. అయితే ఈ చేరికపై శ్రీకాంతాచారి తల్లి, వెంకటాచారి భార్య స్పందించారు. తమ కుటుంబం టీఆర్​ఎస్​లోనే ఉందని తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ka paul, Missing cases, Srikanth

  ఉత్తమ కథలు