హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Panchangam: రాజుకు భారం..ఆ 3 నెలలు కీలకం..తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

Telangana Panchangam: రాజుకు భారం..ఆ 3 నెలలు కీలకం..తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

తెలంగాణ భవిష్యత్తు..పంచాంగం ఏం చెబుతుంది?

తెలంగాణ భవిష్యత్తు..పంచాంగం ఏం చెబుతుంది?

Telangana Panchangam: శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు శ్రీ శోభాకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం పటించారు. మరి ఈ తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana Panchangam: శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు శ్రీ శోభాకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం పటించారు. మరి ఈ తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే నెలలో రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి.. పోలీసులు అప్రమత్తం..!

పెండింగ్ బిల్లులన్నింటికీ కూడా ఈ ఏడాది క్లియరెన్స్ రాబోతుందంట. అయితే కొంతమంది వ్యక్తుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకతలు వస్తాయి. అందుకే పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యాశాఖలో అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉంది. ఇక న్యాయవ్యవస్థలు ఈ ఏడాది కీలక తీర్పులు ఇస్తాయట. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు జరగబోతున్నాయి.

ఇదేం చెత్త బ్రతుకు..? వరంగల్‌లో ఎవర్ని కదిలించినా ఇదే మాట..! కారణం ఇదే..!

ఈ మూడు నెలల్లో కూడా విపరీతమైన ఒడిదొడుకులు జరగబోతున్నాయి. మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలి. ఈ ఏడాదిలో కాళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండబోతున్నాయి. అలాగే పాడి, పంటలు అద్భుతంగా ఉంటాయి. రాష్ట్రం రుణాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విద్యారంగంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు.

మొత్తానికి ఈ ఏడాదిలో రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతాయని తెలంగాణ పంచాంగం ఆధారంగా అర్ధం అవుతుంది.

First published:

Tags: Telangana, Telangana Politics, Ugadi 2023

ఉత్తమ కథలు