SRI RAMA NAVAMI 2021 WATCH SRI RAMANAVAMI LIVE WHICH IS HELD IN NORMAL WAY AT BHADRACHALAM OF TELANGANA HERE IS THE DETAILS NK
Sri Rama Navami: కల్యాణం.. కమనీయం.. భద్రాద్రి రామయ్య కల్యాణం లైవ్ చూడండి
Sri Rama Navami: కల్యాణం.. కమనీయం.. భద్రాద్రి రామయ్య కల్యాణం లైవ్ చూడండి (image credit - Facebook)
Sri Rama Navami 2021: ప్రతి సంవత్సరం భద్రాచలంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా కరోనా జాగ్రత్తలతో కల్యాణం జరుపుతున్నారు. లైవ్ చూడండి.
Sri Rama Navami 2021: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా... శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం ఉన్నంతలో వైభవంగా జరుపుతున్నారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు. గతేడాది లాగే ఈసారి కూడా అలాగే నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. చైత్ర శుద్ధ నవమి సందర్భంగా నేడు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతోంది. ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో ఈ వేడుకను జరిపేవారు. 2020లో మాత్రం లాక్డౌన్ కారణంగా తొలిసారి రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో జరిపారు. ఈసారి కరోనా సెకండ్‌వేవ్ ఉంది కాబట్టి... ఇప్పుడు కూడా నిత్య కల్యాణ మండపంలోనే ఈ వేడుకను హంగామా లేకుండా జరుపుతున్నారు. సీతారాముల కల్యాణానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్... సతీ సమేతంగా హాజరయ్యారు. లైవ్ వీడియో చూడండి.
తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR). వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి సంవత్సరం వైభవంగా జరిపే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా ఈసారి అందరం కలిసి జరుపుకోలేకపోతున్నామనీ.... భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా చూడాలని ఆయన ప్రజలను కోరారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని శ్రీసీతారాములను సీఎం ప్రార్థించారు. కరోనాతో బాధపడుతున్న కేసీఆర్‌కు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడి ఆశీర్వాదంతో కొవిడ్-19పై విజయవంతంగా పోరాడి, ప్రజలు దాన్నుంచి బయటపడాలని ఆమె కోరారు. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలనీ, వారి దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని సీఎం ఆకాంక్షించారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.