Home /News /telangana /

SRI RAMA NAVAMI 2019 BHADRACHALAM ALL DECKED UP FOR SITA RAMA KALYANAM SB

భద్రాద్రిలో కల్యాణ శోభ... మరికాసేపట్లో రాముని కల్యాణం

భద్రాచలంలో రాములోరి ఉత్సవం(ఫైల్ ఫోటో)

భద్రాచలంలో రాములోరి ఉత్సవం(ఫైల్ ఫోటో)

Sri Rama Navami 2019:భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి నవాహ్నిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

    భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఎక్కడ చూసినా సీతారామ కల్యాణ శోభ కనిపిస్తోంది. చలువ పందిళ్లు, పూల తోరణాల మధ్య కల్యాణానికి రాముడు సిద్ధమవుతున్నాడు. రాములోరి పెళ్లి చూసేందుకు పదండంటూ... జనం భద్రాద్రికి క్యూ కడుతున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి కొత్త శోభ సంతరించుకుంది. ముత్యాల పందిరి భద్రాద్రి రాముని పెళ్లికి ముస్తాబైంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి నవాహ్నిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ అంకురారోపణతో ఈ ప్రారంభించారు. తొలి రోజున ప్రత్యేక తీర్థ బిందెను గోదావరి నుంచి తీసుకొచ్చి అంకురారోపణం చేశారు. 11న ధ్వజపట మండల లేఖనం, 12న ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు.

    ఇక ఏప్రిల్ 14న అంటే ఈ రోజున సీతారామచంద్రస్వామి వారి కల్యాణం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 10.30 గంటలకు సీతరాములకు ఘనంగా కల్యాణం జరపనున్నారు. 15న శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు.
    First published:

    Tags: Badradri, Sri rama navami 2019, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు