Home /News /telangana /

SREE NIDHI ORGANIZATION WILL GIVE LOANS OF UP TO 3 LAKHS TO WOMEN GROUPS FOR DOING BUSINESS PRV

Business Loan: మహిళా సంఘాలకు గుడ్​న్యూస్​.. రూ. 2.91 లక్షల వరకు రుణం.. వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వ్యాపారం పట్ల ఆసక్తి చూపే స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్​న్యూస్​. స్త్రీనిధి సంస్థ వారికి రూ. 3లక్షల వరకు రుణం ఇవ్వనుంది. వివరాలు ఇవే..

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మహిళల్లో దాగి వున్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను (Women Self Help Societies) ఏర్పాటు చేసింది. మహిళలను (Women) పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్ళించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో మహిళలకు సమాజ సమస్యలపై అవగాహన పెంచడం, వాటి పరిష్కారంలో మహిళా సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి.

    పెరటికోళ్ల పెంపకం..

    రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,39,534 మహిళా స్వయం సహాయక సంఘాలు (Women Self Help groups) ఉన్నాయి ఈ సంఘాల లో 47,73,745 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలుగా ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాలలో మహిళా స్వయం సహాయక సంఘాల పై సెర్ప్‌ నిత్య పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. తాజాగా వారి కోసం స్త్రీ నిధి (Sree nidhi)) సంస్థ రుణాన్ని అందించడానికి సిద్ధమైంది. మాంసప్రియులు బాయిలర్‌ కోళ్లకు (Hen) బదులు పెరటి కోళ్లను తినడానికి ఇష్టపడుతుండటంతో వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పెరటికోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపే స్వయం సహాయక మహిళా సంఘాలకు (Women's Self Help Groups) ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల యూనిట్లను పంపిణీ చేయాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది.



    యూనిట్‌కు రూ.2.91 లక్షల రుణం..

    ఏప్రిల్‌ నుంచి జూన్‌ చివరి వరకు 9,500 యూనిట్లు పంపిణీచేశారు. స్వయం సహాయక సంఘాల నుంచి వస్తున్న స్పందనను చూసి ఎన్ని యూనిట్లకైనా రుణం ఇవ్వడానికి సిద్ధమైంది స్త్రీనిధి . గత ఆర్థిక సంవత్సరంలో 37వేల యూనిట్లకు రుణాలను అందించారు. వీటి ద్వారా దాదాపుగా 3.70 లక్షల పెరటి కోళ్లను పెంచి, మార్కెట్‌లో విక్రయించారు. పెరటి కోళ్లకు మార్కెట్‌లో కిలోకు రూ.350-400 వరకు ధర లభిస్తుండటంతో పెంపకందారులు లాభాలు గడిస్తున్నారు. కోళ్ల పెంపకంతో పాటు మదర్‌ యూనిట్లను పెంచడానికి కూడా రుణాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క మదర్‌ యూనిట్‌కు రూ.2.91 లక్షల రుణం ఇస్తారు. వీటి ద్వారా నెలకు రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. పిల్లలు మూడు నెలలు పెరిగిన తరువాత వాటిని విక్రయిస్తారు.

    4,39,534 స్వయం సహాయక సంఘాలు..

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం 79,223 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,39,534 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 552 మండల సమాఖ్యలు, 17,864 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Business Loan, Women

    తదుపరి వార్తలు