హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఘోరం.. అదుపుతప్పి నడిరోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో..

ఘోరం.. అదుపుతప్పి నడిరోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో..

ప్రమాదానికి గురి అయిన కారు

ప్రమాదానికి గురి అయిన కారు

హైవేలపై అతి వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అతి వేగమే దీనికి ప్రధాన కారణం కాగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం కూడా ఈ దారుణాలకు మరో కారణం అవుతోంది.

  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువయిపోతున్నాయి. హైవేలపై అతి వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అతి వేగమే దీనికి ప్రధాన కారణం కాగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం కూడా ఈ దారుణాలకు మరో కారణం అవుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్ నగర్ బైపాస్ వద్ద అదుపుతప్పింది. ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

  అయితే మృతులంతా మలక్ పేట్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో కూడా ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ఓ యువకుడు కారును నడపడం వల్లే ఈ ఘోరం జరిగింది. అతి వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

  ఇది కూడా చదవండి: పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!

  అటు హైదరాబాద్ లోనూ, ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత, తెల్లవారుజామున సమయాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతంగా మద్యం తాగి యువత వాహనాలను నడుపుతోంది. మితిమీరిన వేగం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Boat accident, Bus accident, Car accident, Crime news, Fire Accident, Hyderabad

  ఉత్తమ కథలు