Home /News /telangana /

SPECIAL RECOGNITION FOR KOLHAPUR MANGOES IN IN THE COUNTRY AND ABROAD SNR NNK NJ

Nagarkurnool:కేవలం అక్కడి మామిడి పండ్లలోనే ఆ స్పెషాలిటీ ఉందంట..మీకు తెలుసా

ఆ రుచే వేరు

ఆ రుచే వేరు

Nagar kurnool:ఫలాల్లో మామిడికి రాజుగా పేరుంది. అలాంటి మామిడి ఫలాల్లో అనేక రకాలు మార్కెట్‌లోకి దొరికినప్పటికి కొల్లాపూర్‌ మామిడికి ఉంటే స్పెషాలిటీ వేరు. అక్కడ సాగు చేసే బంగినపల్లి మామిడి ఇతర రకాలతో పోటీ పడటమే కాకుండా విదేశాలకు ఎక్కువగ ఎగమతి అవుతుంది.

ఇంకా చదవండి ...
  (N.Naveen Kumar,News18,Nagar Kurnool)
  వేసవి సీజన్‌లో ఎక్కువగా దొరికే పండ్లు మామిడి. వీటిలో ఎన్నో రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం మామిడి పండుకు ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా జనానికి తెలిసినవి బంగినపల్లి, బెనీస, రసాలు, హిమాయత్, ఇమామ్‌ పసంద్, కోతమామిడి, నూజివీడు రసాలు అనేక రకాల మామిడి పండ్లు(Mango fruits) ఉన్నప్పటికి బంగినపల్లి మామిడి ఎవర్‌గ్రీన్‌గా చూస్తాం. అలాంటి బంగినపల్లి మామిడి ఎక్కువగా పండించే ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లా(Nagar kurnool)కొల్లాపూర్. కొల్లాపూర్‌(Kolhapur)లో పండే బంగినపల్లి మామిడి కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పండే ప్రతి ఒక్కటి దాదాపుగా సేంద్రియ పంటలు(Organic crops)కావడంతో రసాయనాల బెడద ఉండదని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. టేస్ట్‌లో అమృతగా రంగులో బంగారపు వన్నెగా, వాసనతో సుగంధంతో పోటీ పడుతుందని టాక్. అందుకే కొల్లాపూర్‌లో పండే మామిడి పండ్లకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో సైతం అభిమానులున్నారు. కొల్లాపూర్‌ మామిడి గల్ఫ్(Gulf), మలేషియా(Malaysia), ఫ్రాన్స్(France), సింగపూర్(Singapore) దేశాలకు ఎగుమతి అవుతుంది. గతంలో ఎక్స్‌పోర్ట్ ఏజెన్సీల ద్వారా…ఎగుమతి అయ్యే మామిడిని ప్రస్తుతం ప్రభుత్వమే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రపర్టీ ( సెర్ఫ్) రైతుల నుంచి మామిడి సేకరించి ఎగుమతి చేస్తోంది.

  కొల్లపూర్‌ మామిడి టేస్టే వేరు..
  కొల్లపూర్ మామిడిలో అధిక పోషకాలు ఉండటంతో పోషకాలపుట్టగా పేరుగాంచింది. టీఎస్ఎస్( టోటల్ సాలబుల్ సలీడ్) ఉండటంతో అమృతంతో పోటీపడి రుచిని అందిస్తుంది. ఐరెన్, కాల్షియం, పాస్పరస్‌తో పాటు పుష్కలంగా విటమిన్‌లు ఉండే ఫలంగా ఇక్కడి కొల్లాపూర్‌ మామిడికి పేరుంది. పండులోని కండ మెత్తగా ఉండటం, పీచు లేకపోవడం, నోట్లో పెట్టుకోగానే వెన్నెల కరిగిపోవడంతో కొల్లాపూర్‌ మామిడి రుచి మరిగిన వాళ్లు వేరే రకం తినడానికి ఇష్టపడని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు.

  (కొల్లాపూర్ మామిడి టేస్టే వేరు)


  కొల్లాపూర్ సంస్థానదీశుల కాలంలోనే మామిడి తోటలు..
  కొల్లపూర్ సంస్థానాధీశులైన సురభి వంశస్థ రాజులు సుమారు 120 ఏళ్ల క్రితం ఈ మామిడి తోటలను ప్రోత్సహించారు. అప్పటి రాజులు ఏరి కోరి నూజివీడు నుంచి మొక్కలను తెప్పించి మామిడి తోటల్ని అభివృద్ధి చేశారు. నూజివీడు నుంచి వచ్చిన మామిడి అక్కడి కంటే ఎక్కువ రుచిని కొల్లపూర్లో అందిస్తుంది. కారణం నూజివీడు ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉండటం, సమశీతోష్ణ స్థితి లేకపోవడం, వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో అక్కడ లభించే మామిడి అంతగా రుచిని అందించలేకపోయాయి. కొల్లాపూర్ నేలలు కృష్ణ నది తీరంలో ఉండటం, ఇక్కడి భూసారం మామిడి తోట ఎదుగుదలకు సహకరించడంతో మామిడి సాగు వేగంగా విస్తరించింది. నిజానికి ఆంధ్రలో పండే మామిడికి మచ్చలు వస్తాయి. రుచిలో కొంత తేడా ఉంటుంది. తెలంగాణలో పండే మామిడి మచ్చల బెడద ఉండకపోగా రుచిలో అమృతాన్ని తలపిస్తుందనే టాక్ ఉంది.

  చూస్తేనే తినాలనిపించే కొల్లాపూర్ మామిడి..
  దేశంలో మహారాష్ట్ర-ఆల్ఫాన్సో, కర్ణాటక - తోతాపురి, పశ్చిమ బెంగాల్-హింసాగర్, గుజరాత్-కేసర్, ఉత్తరప్రదేశ్-దశేరి, ఒరిస్సా-సువర్ణరేఖ, బిహార్-చౌసా పండ్లకు తెలంగాణ బంగినపల్లి మామిడి తీవ్రమైన పోటీ ఇస్తుంది. పురాణాల ప్రకారం మామిడి పండు ఇప్పటిది కాదనే నానుడి కూడా ఉంది. బృహ హరప్పా కంటే ప్రాచీనమైంది…తెలంగాణ నాగరికత కాబట్టి, ఆ మధురఫలాన్ని పండించిన తొలి తరం రైతులూ మనవాళ్లే అయి ఉంటారనే నానుడి ఉంది. అందుకే కొల్లపూర్ మామిడికి చిరునామాగా నిలిచింది. రాష్ట్రంలో 1,23, 828 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష 23 వేల 828 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నట్టు అంచనా. వీటిలో 60 శాతానికి పైగా కొల్లాపూర్ రకమే. సంగారెడ్డి, జగిత్యాల ప్రాంతాల్లోనూ నాణ్యమైన మామిడి ఉత్పత్తి అవుతుంది. కొల్లపూర్ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో కొల్లపూర్ లో పెద్ద ఎత్తున మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mango, Nagar kurnool

  తదుపరి వార్తలు