హైదరాబాద్ రోడ్లపై మంత్రి కేటీఆర్ అధికారులతో ప్రత్యేక భేటీ...

వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు, గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, అయితే ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

news18-telugu
Updated: October 19, 2019, 10:45 PM IST
హైదరాబాద్ రోడ్లపై మంత్రి కేటీఆర్ అధికారులతో ప్రత్యేక భేటీ...
బ్రౌన్ కలర్ షర్ట్‌లో కేటీఆర్
news18-telugu
Updated: October 19, 2019, 10:45 PM IST
ప్రగతి భవన్‌లో జీహెచ్ఎంసీ అధికారులతో మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు, గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, అయితే ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.  దీంతో పాటు సిటీలో సాధ్యమైనన్ని రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతంపై మంత్రి సమీక్షలో చర్చించారు. త్వరితగతిన మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఆర్‌డిసి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. బోరబండ - మియాపూర్ రహదారి నుంచి హైటెక్ సిటీ దిశగా స్లిప్ రోడ్ల ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...