నన్ను చంపాలనుకుంటున్నది ఎవరు?... పోలీసులకు రాజాసింగ్ సూటి ప్రశ్న

నన్ను చంపాలనుకుంటున్నది ఎవరు?... పోలీసులకు రాజాసింగ్ సూటి ప్రశ్న (File)

రాజాసింగ్‌ పేరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండటంతో... పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఐతే... ఆ ఉగ్రవాదులు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

 • Share this:
  తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. ఉదయాన్నే రాజాసింగ్ ఇంటికి పోలీసులు రావడంతో... ఏంటి విషయం అని అడిగారు రాజాసింగ్. "ఈమధ్య కొందరు ఉగ్రవాదుల్ని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. వారి దగ్గరున్న హిట్ లిస్టులో మీ పేరు ఉంది. మిమ్మల్ని చంపాలని ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం మీకు భద్రతను పెంచింది" అని పోలీసులు చెప్పడంతో... రాజాసింగ్... "నన్నా... అంత సీన్ ఎవడికుంది... ఆ ఉగ్రవాదులు ఎవరో చెప్పండి" అని కోరారు. పోలీసులు... "ఇకపై మీరు బైక్‌పై తిరగొద్దు. ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లండి" అని ఎమ్మెల్యేకి హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ సూచించారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్‌ భద్రతను చూసుకుంటారని ఆయన వివరించారు.

  రాజాసింగ్ మాత్రం... ఇవన్నీ కాదు... అసలు నాకు ఎవరి నుంచి ప్రాణాహాని ఉందో చెప్పండి అని డిమాండ్‌ చేశారు. మీరు చెప్పకపోయినా ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. దీనిపై కేంద్ర, రాష్ట్ర హోంశాఖా మంత్రులకు లెటర్ రాస్తాను. నిజానిజాలు బయటకు లాగుతాను అన్నట్లు తెలిసింది.

  మొత్తానికి రాజాసింగ్‌ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే... ఇంకా ఎంత మందిని లిస్టులో పెట్టుకొని ఉంటారు? అసలు రాజాసింగ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు. ఎక్కడో ఉండే ఉగ్రవాదులకు ఆయన ఎందుకు ఫోకస్ అయ్యారు... ఇలా చాలా అంశాలు తెరవెనక చర్చకు దారి తీస్తున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: