ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు వెనక్కి తీసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం జనవరి 18న నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. అయితే జనవరి 22న కోర్టుకు హాజరైన అసదుద్దీన్ తాను కోర్టు విచారణకు హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నేడు ఆయన కోర్టుకు హాజరయ్యారు. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉపసంహరించాలని కోర్టు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆయనపై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. ఇక, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి అసదుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్ష్యులు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.
మరోవైపు షబ్బీర్ అలీపై దాడిలో తన పాత్ర లేదని అసుదుద్దీన్ గతంలోనే తెలిపారు. తాను దాడి చేసే వారిని అడ్డుకున్నానని చెప్పారు. ఇక, ఈ కేసులో అసదుద్దీన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మీర్‌చౌక్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. షబ్బీర్ అలీపై దాడిలో అసదుద్దీన్ పాత్ర ఉందని కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో అసదుద్దీన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అసదుద్దీన్ పలుమార్లు కోర్టుకు గైర్హాజర్ కావడంతో ఈ నెల 18న న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Published by:Sumanth Kanukula
First published:January 25, 2021, 14:14 IST