Home /News /telangana /

SP CAN WIN IN UTTERPRADESH MINISTER KTR SAYS IN ASK KTR PROGRAMME VRY

Ask KTR : యూపీలో ఎస్పీదే హవా... నేరస్థులు, 420 గాళ్లతో చర్చకు దిగలేను .. పలు ఆసక్తికర ట్వీట్స్..

కేటీఆర్​ (ఫైల్​)

కేటీఆర్​ (ఫైల్​)

Ask KTR : టిఆర్ఎస్ ( trs ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటిఆర్ ( KTR )నెటిజన్స్‌తో చాట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సినిమా, క్రీడల వంటి అనేక అంశాల పైన మంత్రి స్పందించారు.

  Ask KTR : టిఆర్ఎస్ ( trs ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటిఆర్ ( KTR )నెటిజన్స్‌తో చాట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సినిమా, క్రీడల వంటి అనేక అంశాల పైన మంత్రి స్పందించారు.

  Ask KTRలో మంత్రి కేటీఆర్ నేడు నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాజాగా జరిగిన చాటింగ్ పలు సమస్యలతో పాటు రాజకీయ అంశాలను ( political issues ) కేటీఆర్‌ను అడిగారు... ఈ చాటింగ్‌లో ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోతున్న ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో (UP elections ) ఏ పార్టీ గెలుస్తుందని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.. రానున్న ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ వైపు గెలుపు పవనాలు వీస్తున్నాయని కేటీఆర్ అన్నారు. బిజెపికి ( bjp ) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో ప్రచారం చేసే అంశం పైన సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

  UP Elections : ఆమె కూతురు బీజేపీ ఎమ్మెల్యే చేతిలో రేప్‌కు గురైంది..! బాధితురాలి తల్లికి, ఇలా అవకాశం కల్పించింది కాంగ్రేస్ పార్టీ..

  తెలంగాణ రాష్ట్రంలో బిజెపి చేస్తున్న అసత్య మరియు ద్వేష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునేంత విజ్ఞులని, తెలంగాణ కోసం ఎవరు పని చేస్తున్నారో వారికి తెలుసని కేటీఆర్ అన్నారు.బిజెపి పార్టీని రాష్ట్రంలో లో ఆపేందుకు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా మేము ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని, తెలంగాణకు శాంతి, అభివృద్ధి, సుస్థిరత కావాలని అన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ కన్నా పూణే నగరం మంచి అభివృద్ధిని కనబరుస్తున్నదన్న బిజెపి ఎంపీల వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ స్పందించారు. మూర్ఖులు చేసే ప్రచారాన్ని వదిలి వేయడమే మంచిదన్నారు. హైదరాబాద్ ( ( Hyderabad )నగర పేరుని భాగ్యనగరంగా మారుస్తామంటున్న బిజెపి మాటలను ఒక సిల్లీ పొలిటికల్ స్టంట్ గా కేటీఆర్ అభివర్ణించారు.

  ఇక తనతో చర్చకు రావాలని అంటున్న రేవంత్ రెడ్డి ( Reventh reddy ) తో చర్చకు వెళ్తారా అని అడగగా, రేవంత్ రెడ్డి ముందుగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ గారితో చర్చ చేయాలని... తాను నేరస్థులు, 420 మోసగాళ్లతో చర్చకు దిగలేనన్నారు.

  TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..

  జాతీయ రాజకీయాల పైన తనకు ఆసక్తి లేదని తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంలోనే సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోవడంతో, దాని గురించి మాట్లాడేందుకు ఏలాంటి అవకాశం లేకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా మతమే తన ఎజెండాగా బిజెపి ముందుకు వెళ్తున్నదన్నారు. ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయల ప్రధాని మోడీ హామీ ఈ శతాబ్దపు జుమ్లా అన్నారు.

  ప్రతిష్టాత్మక దేవరకొండ కోట సంరక్షణపై ఓ నెటిజన్ ట్వీట్‌కు సంబంధిత మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడుతానన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం అంతానికి ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమంలో తొలి దశ పూర్తవుతుందన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం సబ్సిడీ ఉందని, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ లకు సంబంధించి టి ఎస్ రెడ్కో తో కలిసి అనేక ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించయని తెలిపారు.

  CM KCR : రైతులకు శుభవార్త.. వారికి మరో కొత్త పథకం.. కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించిన సీఎం

  సికింద్రాబాద్ ( Secundrabad ) కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా రోడ్లను మూసివేయడం పైన రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ( Parlament ) మరియు ఇతర జాతీయ వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతామని అన్నారు. నార్త్ హైదరాబాద్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సుచిత్ర జంక్షన్ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. బహదూర్ పుర ఫ్లైఓవర్ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు.

  ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో కేసుల సంఖ్య పెరగడం లేదా ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు ప్రభుత్వం లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకుంటుందని, కేటీఆర్ అన్నారు. దీంతో పాటు ఆయా జిల్లాల్లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సంబంధిత అధికారులు మంత్రులతో కలిసి సమస్యను పరిష్కరించనున్నట్టు తెలిపారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, KTR, Twitter

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు