రైతులకు చల్లని కబురు.. జూన్ 8న రాష్ట్రంలోకి రుతుపవనాలు..

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

వాతావరణ శాఖ రైతన్నలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాయని తెలిపింది.

  • Share this:
    కరోనా దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తామని చెప్పినా.. పలు చోట్ల కురిసిన అకాల వర్షాలు అన్నదాతల కడుపు కొట్టాయి. అయితే, వాతావరణ శాఖ రైతన్నలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాయని తెలిపింది. గత ఏడాది జూన్ 23న రాష్ట్రంలోకి ప్రవేశించాయి.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని వెల్లడించింది. కేరళలోకి జూన్ 1న ప్రవేశించి.. వారానికి తెలంగాణకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ వివరించింది. జూన్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని పేర్కొంది. సగటు వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

    జూన్ 1నే దేశంలోకి రానున్న రుతుపవనాలు.. రెండు వారాలు ఆలస్యంగా తిరోగమన బాట పడతాయని, అంటే.. రెండు వారాల పాటు అదనంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, గత ఏడాది రెండు వారాలు ఆలస్యంగా రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దాంతో రైతుల పంటలు ఆలస్యంగా సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ సారి మాత్రం త్వరగానే ప్రవేశిస్తుండటం.. రైతన్నలకు శుభవార్తే.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: