తిరుపతి-కరీంనగర్ మధ్య వారంలో మూడు రోజులు ప్రత్యేక రైళ్లు...పూర్తి వివరాలివే
South Central Railways | Tirupati - Karimnagar Tri-Weekly Special Trains | ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరుపతి-కరీంనగర్ మధ్య సెప్టెంబరు నెలాఖరు వరకు ప్రతి వారం మూడు రోజులు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
news18-telugu
Updated: July 18, 2019, 6:14 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: July 18, 2019, 6:14 PM IST
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తిరుపతి-కరీంనగర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. వారంలో మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు(నెం.02761) ప్రతి ఆది, మంగళ, గురువారం రోజు రాత్రి 10:40 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.55 గం.లకు కరీంనగర్‌కు చేరుకుంటాయి. సెప్టెంబరు 29 వరకు ఈ ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైలు(నెం.02762) నడుస్తుంది. ప్రతి రోజు రాత్రి 7.15 గం.లకు కరీంనగర్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 08.10 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్‌ను ప్రారంభించారు.
ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, విజయవాడ, మధీర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు మొత్తం 62 సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్
Indian Railways: గుడ్ న్యూస్... రైళ్లల్లో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్
Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే
IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి భారత్ దర్శన్ ట్రైన్... ప్యాకేజీ వివరాలివే
Railways Jobs: రైల్వే జాబ్ కావాలా? సదరన్ రైల్వేలో 3429 ఉద్యోగాలు
62 Tri-Weekly Special Trains between Tirupati and Karimnagar @RailMinIndia @PiyushGoyalOffc pic.twitter.com/GleO5oRaHc
— SouthCentralRailway (@SCRailwayIndia) July 18, 2019
Loading...