ఆర్వోబీ పనుల కారణంగా రైళ్లు రద్దు.. ప్రయాణికులు గమనించాలంటున్న దక్షిణమధ్య రైల్వే..

ఆర్వోబీ పనుల కారణంగా రైళ్ల సమయాల్లో మార్పు

రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. రద్దైన రైళ్లు ఫలక్‌నుమా-జనగాం, జనగాం-ఫలక్‌నుమా రైళ్లు ఈ నెల 20 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, 30 తేదీల్లో.. జూన్ 23న కూడా రద్దు కానున్నాయి.

  • Share this:
    సికింద్రాబాద్-కాజీపేట సెక్షన్‌లోని భువనగిరి-రాయగిరి స్టేషన్ల మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. రద్దైన రైళ్లు ఫలక్‌నుమా-జనగాం, జనగాం-ఫలక్‌నుమా రైళ్లు ఈ నెల 20 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, 30 తేదీల్లో.. జూన్ 23న కూడా రద్దు కానున్నాయి.

    మరికొన్ని రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు జరిగాయి. అవేంటంటే.. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బదులుగా 2.30 గంటలకు బయల్దేరుతుంది. విజయవాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ని 21, 28 తేదీల్లో మార్గమధ్యలో 35, 50 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు. కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ని 22, 27, జూన్ 23 తేదీల్లో 50 నిమిషాల పాటు నిలిపివేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

    వేసవి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఈ నెల 24న రాత్రి 11.40గంటలకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి 25న సాయంత్రం 5.35 గంటలకు ప్రత్యేక రైళ్లు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ సమయాలను సరిచూసుకోని ఇబ్బందులు పడకుండా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుపుతున్నారు.
    First published: