హోమ్ /వార్తలు /తెలంగాణ /

Secunderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ పరిధిలో ఇవాళ, రేపు ఈ రైళ్లు రద్దు..

Secunderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ పరిధిలో ఇవాళ, రేపు ఈ రైళ్లు రద్దు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Traines Cancelled: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ, రేపు కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఐతే కొన్ని సర్వీసులను మాత్రం పునరుద్ధరించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)లో హింసాత్మక ఘటనల ప్రభావం రైళ్ల రాకపోకలపై తీవ్రంగా పడుతోంది. నిన్నటి నుంచి చాలా రైళ్లు రద్దయ్యాయి. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. సికింద్రాబాద్‌ స్టేషన్ వరకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొన్ని రైళ్లను మౌలాలీ, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లిలోనే నిలిపివేశారు. శుక్రవారం ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో.. వాటిని రైల్వే అధికారులు (South Central Railway) మరమ్మతులు చేస్తున్నారు. రైళ్ల పునరుద్ధరణ పనులను వేగంవంతం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లను పునరుద్ధరించారు. ఐనప్పటికీ కొన్ని రైళ్లను మాత్రం ఇవాళ, రేపు రద్దు (Trains Cancelled) చేశారు. ఇంకొన్ని రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు.

రద్దైన రైళ్ల వివరాలు:

జూన్ 18న మన్మాడ్- సికింద్రాబాద్ అజంతా ఎక్స్‌ప్రెస్(నెం.17063) రైలు రద్దు.

జూన్ 18న సాయినగర్ షిర్డి- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.17001) రైలు రద్దు

జూన్ 19న త్రివేండ్రం సెంట్రల్ -సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ (నెం.17229) రైలు రద్దు

జూన్ 19న దనాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.12792) రైలు రద్దు

జూన్ 18,19 తేదీల్లో భువనేశ్వర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015) రైలు రద్దు

జూన్ 19న శాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (18045) రైలు రద్దు

జూన్ 18న విశాఖపట్టణం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రైలు రద్దు

జూన్ 17న కేఎస్ఆర్ బెంగళూరు- దనాపూర్ సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ (12295) రైలు రద్దు

జూన్ 18న కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం మెము (17267) రైలు రద్దు

జూన్ 19న విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ మెము (17268) రైలు రద్దు

సికింద్రాబాద్ ఘటనతో ఏపీ అప్రమత్తం.. వాల్తేరు రైల్వే డివిజన్ లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌లో ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7, లింగపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగపల్లి రూట్లో ఒక రైలు, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఒక రైలును రద్దు చేసింది. తిరిగి సోమవారమే ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

Agnipath Row : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసంతో నష్టం ఎంతంటే.. తెలంగాణ అంతా టెన్షన్

మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ఈ వివరాలను ఇక్కడ చూడండి.


ఇవి కాకుండా మూడు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. గురువారం రాత్రి 11.45 గంటకు సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లాల్సిన 12745 రైలు.. అర్ధరాత్రి తర్వాత 02.45 గంటలకు బయలుదేరి వెళ్లింది. ఇవాళ సికింద్రాబాద్ నుంచి దనాపూర్ వెళ్లే 12791 రైలు ఉదయం 09.25 గంటలకు కాకుండా.. మధ్యాహ్నం 3.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇవాళ కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీ వెళ్లే 17206 రైలు ఉదయం 6 గంటలకు కాకుండా.. 07.30 గంటలకు బయలుదేరింది.

ఇవాళ నడవాల్సి ఉన్న పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బీదర్-హైదరాబాద్ రైలు (17009), హైదరాబాద్-విశాఖపట్టణం (12728), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604), హైదరాబాద్-తాంబరం (12760), విశాఖపట్ణణ-హైదరాబాద్ (12727), తాంబరం-హైదరాబాద్ (12759) రైళ్లను పునరుద్ధరించారు.

First published:

Tags: Hyderabad, Indian Railways, Secunderabad, Secunderabad railway station, South Central Railway