హోమ్ /వార్తలు /తెలంగాణ /

Medaram Jathara Trains: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 20 ప్రత్యేక రైళ్లు

Medaram Jathara Trains: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 20 ప్రత్యేక రైళ్లు

Special Trains: ఆ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు..

Special Trains: ఆ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు..

Medaram Sammakka Saralamma Jathara special trains | అన్ని ప్రత్యేక రైళ్లల్లో సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి. మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఈ ప్రత్యేక రైళ్లల్లో టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. రైళ్ల టైమింగ్స్, రైలు ఆగే స్టేషన్ల వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త. మేడారం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే  20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ రూట్‌లో 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో 10 రైళ్లను ప్రకటించింది. ఈ 20 రైళ్లు మేడారం వెళ్లే భక్తులకు సేవలు అందించనున్నాయి. అన్ని ప్రత్యేక రైళ్లల్లో సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి. మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఈ ప్రత్యేక రైళ్లల్లో టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. రైళ్ల టైమింగ్స్, రైలు ఆగే స్టేషన్ల వివరాలు తెలుసుకోండి.

సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ 10 సర్వీసుల్ని ప్రకటించింది రైల్వే. 07014 నెంబర్ గల రైలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.40 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07015 నెంబర్ గల రైలు వరంగల్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దారిలో మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ్, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో ప్రత్యేక రైలు 10 సర్వీసులు ఉంటాయి. 07017 నెంబర్ గల రైలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీరోజు ఉదయం 05:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరుతుంది. ఉదయం 9.30 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07018 నెంబర్‌గల రైలు వరంగల్‌లో ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. దారిలో రాలపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల్, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఒదెల, పోత్కపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజిపేటలో రైలు ఆగుతుంది.

ఇవి కూడా చదవండి:

IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేసే ముందు ఈ రూల్స్ మర్చిపోవద్దు

IRCTC Vizag Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ నుంచి వైజాగ్ టూర్ ప్యాకేజీ

IRCTC Tour: విజయవాడ నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ప్యాకేజీ వివరాలివే

First published:

Tags: Indian Railway, Indian Railways, Medaram, Medaram jatara, Medaram jathara 2020, Railways, South Central Railways, Telangana, Telangana News, Telangana updates, Warangal

ఉత్తమ కథలు