తెలంగాణ హైకోర్టు తరలింపు.. ఎక్కడికి మారుస్తున్నారు..?

కొంతమంది న్యాయవాదులు మాత్రం తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు పరిరక్షణ సమితిగా ఏర్పడి పోరాటానికి సిద్దమవుతున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు భవనాన్ని మరో చోటుకు తరలించవద్దని అంటున్నారు.

news18-telugu
Updated: August 29, 2019, 9:13 AM IST
తెలంగాణ హైకోర్టు తరలింపు.. ఎక్కడికి మారుస్తున్నారు..?
తెలంగాణ హైకోర్టు (File)
news18-telugu
Updated: August 29, 2019, 9:13 AM IST
కొత్త సచివాలయ నిర్మాణం.. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ నిర్మాణాలకు తెలంగాణ సర్కార్ పూనుకున్న సంగతి తెలిసిందే.తాజాగా హైకోర్టును కూడా తరలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న బుద్వేల్ ప్రాంతానికి హైకోర్టును తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై న్యాయస్థానం కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కూడా లేఖ రాసినట్టు సమాచారం. అయితే కొంతమంది న్యాయవాదులు మాత్రం హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న చోటనే హైకోర్టును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మూసీ నది ఒడ్డున వందేళ్ల క్రితం నిర్మించిన హైకోర్టు భవనాలు పాతవి కావడం.. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవడంతో..ఇప్పుడున్న చోటు నుంచి హైకోర్టును తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు భవనంలో రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరగడం కూడా తరలింపుకు కారణమని తెలుస్తోంది. ఇందుకోసం బుద్వేల్‌లో ఇప్పటికే 70 ఎకరాల ఖాళీ స్థలాన్ని హైకోర్టుకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే బార్ కౌన్సిల్‌లో చర్చించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

కొంతమంది న్యాయవాదులు మాత్రం తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు పరిరక్షణ సమితిగా ఏర్పడి పోరాటానికి సిద్దమవుతున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు భవనాన్ని మరో చోటుకు తరలించవద్దని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అంటున్నారు. ఈ మేరకు హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...