సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట అగ్నిప్రమాద ఘటనలో మంటలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. 22 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు మరో గంటలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఫైరింజన్లు వచ్చాయని.. ప్రస్తుతం సిటీలోని అన్ని ఫైరింజన్లు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. ఘటనలో నలుగురిని కాపాడామని ఆయన తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇద్దరు సీనియర్ ఆఫీసర్లకు తీవ్రగాయాలు అయ్యాయని వెల్లడించారు. వారిలో ఒకరు ఐసీయాలో ఉన్నాయని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. లోపల ఉన్న మెటీరియల్ వల్లే మంటలు భారీగా వ్యాపించాయని అన్నారు. ముంద జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లను ఖాళీ చేయించామని తెలిపారు. ప్రమాదానికి గురైన భవనంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే చుట్టుపక్కల ఇళ్లల్లోని వాళ్లు తమ నివాసాలకు రావాలని సూచించారు.
ఉదయం 10 గంటల తరువాత తలెత్తిన ఈ అగ్నిప్రమాదం(Fire Accident) అదుపులోకి రావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భవనంలోని మంటలు అదుపు చేయడం సాధ్యంకాకపోగా.. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు(Building) కూడా వ్యాపించే పరిస్థితి ఏర్పడటంతో ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. ఘటనస్థలంలో దట్టమైన పొగ(Smoke) అలముకుంది. ఈ స్పోర్ట్స్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అగ్నికీలలను(Fire) అదుపు చేయడానికి ప్రయత్నించారు.
కానీ పరిస్థితి మాత్రం అదుపులోకి రాకపోవడంతో.. సిబ్బంది మరింతగా శ్రమించారు. ముందుగా బిల్డింగ్‌లోని వారిని రక్షించడంపై దృష్టి పెట్టిన సిబ్బంది.. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ స్టోర్ మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా, స్కైలిఫ్ట్ సాయంతో వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.
Hyderabad: సినిమా లవర్స్‌కు పండగే.. పీవీఆర్‌లో అతి తక్కువ ధరకే మూవీ షో..!
Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర.. మూడు రోజుల్లో తేలిపోతుందా ?
ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి స్పందన రావడంలేదని వివరించారు. ఈ భవనంలో క్లాత్ మెటీరియల్ పెద్ద ఎత్తున నిల్వ ఉండడంతో భారీ స్థాయిలో మంటలు వచ్చాయని, అందుకే మంటలను కట్టడి చేయడం కష్టమవుతోందని మంటలు అర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది, అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Telangana