Home /News /telangana /

SONS BECOME THIEVES FOR THEIR MOTHER FOR HEALTH RECOVERY KNR VRY

Siricilla : రియల్ బిచ్చగాళ్లు.. అమ్మకోసం వినాయకుడి లడ్డుల దొంగతనం ..

siricilla cc footage

siricilla cc footage

Siricilla : ఆనారోగ్యం పాలైన అమ్మను రక్షించుకునేందుకు కోట్ల రూపాయలున్న వ్యక్తి బిచ్చగాడిగా మారి నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన. సినిమా స్టోరీ మనకు తెలిసిందే.. కాని ఇక్కడ కొంతమంది యువకులు తమ తల్లి ఆరోగ్యం కోసం ఇంచుమించు ఇలాంటీ సంఘటన ఒకటి సిరిసిల్లలో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    రాజన్న సిరిసిల్ల జిల్లా 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్

    మూఢ నమ్మకమో లేక అమ్మమీద ప్రేమో తెలియదు కాని ఇద్దరు యువకులు తమ తల్లి ఆనారోగ్యానికి గురి కావడంతో తట్టుకోలేక పోయారు.. చికిత్స కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగిన తల్లి ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటీ సమయంలో ఓ పూజారీని అశ్రయించిన యువకులకు ఓ ఐడియాను ఇచ్చాడు. తమ అమ్మ ఆరోగ్యం మెరుగు పడాలంటే వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను తినిపించాలని ఆ పూజారి సూచించారు.

    దీంతో వెనక ముందు ఆలోచించుకుండా రంగంలోకి దిగిన ఇద్దరు యువకులు సిరిసిల్ల జిల్లా(siricilla) వెములవాడ(vemulawada) పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ఉన్న లడ్డూలను దొంగిలిస్తున్నారు. ఇలా మూడు నాలుగు రోజులుగా లడ్డూలను దొంగతనం (Theft)చేస్తుండడంతో.. ఆ విషయం కాస్తా సోషల్ మీడియాలో(social media) చక్కర్లు కొడుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల (cc camera)ద్వార లడ్డూలు దొంగతనం చేస్తున్న యువకులను పట్టుకున్నారు. అర్థరాత్రీ పూట ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు వారికి తోడు వచ్చి ఇళ్లతో పాటు మండపాల వద్ద పెట్టిన లడ్డూలను తీసుకువెళతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

    ఇది చదవండి : సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడ్డట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం


    దీంతో విచారణ చేపట్టిన వేములవాడ పోలీసులకు (police) ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. అచ్చు బిచ్చగాడి సినిమాలో కోటిశ్వరుడైన హీరో చివరి అవకాశంగా బిచ్చగాడిగా మారితే తల్లి బతికినట్టుగా ఇక్కడ కూడా ఓ పూజారీ చెప్పిన విధంగా చేసి దొంగలుగా మారారని చెప్పారు. అయితే ఇదంతా తమ తల్లి ఆనారోగ్యంతో గురి కావడంతో చేశామని, తాము తల్లి ఆరోగ్యం(mother health) కోసం దొంగలుగా మారినా పర్వాలేదని చెప్పడం విశేషం. ఈ కేసులో మరో విశేషం ఏటంటే గత మూడు రోజులుగా వినాయక మండపాల నుండి తీసుకువచ్చిన లడ్డూను తినిపించడంతో తమ తల్లి ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో గత ఆరు నెలలుగా ఆసుపత్రుల చుట్టు తిరిగి చికిత్స అందిస్తున్న ప్రయోజనం లేకపోయిందని ఆ యువకులు చెప్పినట్టు తెలుస్తోంది.

    ఇది చదవండి : సైదాబాద్ బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా.

    అయితే నగరంలో లడ్డూల మాయంపై సోషల్ మీడియాలో మినహా ప్రత్యక్షంగా ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు పట్టుబడ్డ యువకులపై ఎలాంటీ కేసులు నమోదు చేయకపోవడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి మూఢ నమ్మకాలతో యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Siricilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు