కోడలిపై ఆగ్రహించిందని తల్లిని కొడుకు మందలింపు.. తల్లి ఏం చేసిందంటే..

కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లల్లో పనికి ఎవరూ రానివ్వకపోవడంతో కూరగాయలు అమ్ముకునేది. అయితే కొడుకు రంగస్వామి కారు వాషింగ్ సెంటరులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

news18-telugu
Updated: May 30, 2020, 3:05 PM IST
కోడలిపై ఆగ్రహించిందని తల్లిని కొడుకు మందలింపు.. తల్లి ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోడలిపై తల్లి కోప్పడిందని కొడుకు మందలించడంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపన్‌పల్లికి చెందిన యాదమ్మ(48) ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు రంగస్వామి కొడుకు ఉన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లల్లో పనికి ఎవరూ రానివ్వకపోవడంతో కూరగాయలు అమ్ముకునేది. అయితే కొడుకు రంగస్వామి కారు వాషింగ్ సెంటరులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే యాదమ్మ గురువారం ఏదో విషయమై కోడలిపై కోప్పడింది. ఈ విషయం తెలిసిన కొడుకు రంగస్వామి తల్లి యాదమ్మను మందలించాడు. అయితే శుక్రవారం ఉదయం యాదమ్మ ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో కొడుకు రంగస్వామి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఉరేసుకుని కన్పించింది.
First published: May 30, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading