Home /News /telangana /

SON SUICIDE IN KAMAREDDY DISTRICT BECAUSE OF MOTHER SCOLDING SNR NZB

Telangana : అమ్మ మందలించినందుకే మరణశిక్ష .. ఏమి కొడుకు సామి

(SON SUICIDE)

(SON SUICIDE)

Sad News: ఏ తల్లి అయినా బిడ్డలను సన్మార్గంలో పెట్టుకోవాలని చూస్తుంది. పసివాడిగా ఉంటే భయపెట్టి మార్చుకుంటుంది. పెద్దైన తర్వాత తప్పు చేస్తే ఓ దెబ్బ కొట్టి బుద్ధి చెబుతుంది. చేతికి అంది వచ్చిన కొడుకు బాధ్యతారాహిత్యంగా ఉంటే మందలించినందుకు కొడుకు మనసు చిన్నబోయింది. ఆ బాధ తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  త‌ల్లి చెప్పిన మంచి మాట‌ల‌ను కూడా జీర్ణించుకోలేకపోయాడు ఓ కొడుకు. నవమాసాలు మోసి , కని పెంచిన తల్లికి బిడ్డ బాగోగులు చూసుకునే హక్కు ఉండదా.? పిల్ల‌ల భ‌విష్యత్తు కోసం ఆహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డే తల్లిదండ్రులకు బిడ్డల్ని మందలించే స్వతంత్రం కూడా లేదా..? బిడ్డ ప్రయోజకుడు కావాలని కలలు గనే తల్లి బాధ్యతగా నడుచుకోమని చెప్పడమే పొరపాటైందా..? అమ్మే కదా మంచి చెప్పిందనే ఆలోచన కూడా లేకుండా కామారెడ్డి(Kamareddy)జిల్లాలో కొడుకు(Son) తల్లికి కడుపుకోతను మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకు చెబితే వింటాడనుకున్న ఆ తల్లి బిడ్డ కన్నీరు మిగిల్చి శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేకపోయింది.

  Telangana | Rythu Bima : ఆ డబ్బు కోసం కక్కూర్తి పడిన కొడుకు .. తల్లి పేరుతోనే ప్రభుత్వానికి టోకరా  చేతికొచ్చిన బిడ్డ దూరమైపోయే..
  దేశానికి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. ఎందుకంటే ఏ బిడ్డ అయినా కన్నతల్లికి ఎప్పుడూ పసివాడే అని చెప్పడానికి. కాని కామారెడ్డి జిల్లాలో మాత్రం చేతికి అందివచ్చిన కొడుకు తల్లి చెప్పిన చిన్న మాటకు నొచ్చుకున్నాడు. పని చేయకుండా కాళీగా ఉన్నాడని పని చెప్పినందుకు మనస్తాపానికి గురయ్యాడు. పాతికేళ్లు దాటిన బిడ్డ అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి ..బలవన్మరణం చేసుకొని ఆ తల్లికి కన్నీటి మిగిల్చాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి సురేశ్ ఏలాంటి బాద్య‌త లేకుండా తిరుగుతున్నాడు. 27సంవత్సరాల కొడుకును ఏదైనా పని లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమని తల్లి ఆన‌సూయ పదే పదే కొడుకుతో చెబుతూ ఉండేది. సురేష్ అవేమి పట్టించుకోకుండా కాళీగా ఉంటున్నాడు.  అమ్మపై కోపంతో ఆత్మహత్య..
  సురేష్ తల్లి అనసూయ కొత్తగా ఓ ఇంటిని నిర్మించారు. అందుకోసం కొంత అప్పు చేయాల్సి వచ్చింది. ఈక్రమంలోనే చెట్టంత ఎదిగిన కొడుకు సురేష్‌కి బాధ్యతను గుర్తు చేసింది. ఏదో పని చేసి డబ్బులు సంపాధించని కోరింది. కనీసం పొలానికి మందు కొట్టడం కూడా చేతకాకపోతే ఎలా అంటూ బిడ్డను మందలించింది. తల్లి మాటలతో సురేష్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి తన పొలంలోని మామాడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డ రాత్రికి ఇంటికి రాకపోవడంతో కంగారుపడింది తల్లి. ఫోన్‌ చేసినా రిప్లై ఇవ్వక పోవడంతో ఆందోళన చెందింది. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతులకు సురేష్ చెట్టుకు శవం వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

  HYD | Crime news : పోకిరీ సినిమా స్టైల్లో ఫైరింగ్ .. మిడ్‌నైట్ సెటిల్‌మెంట్‌ పేరుతో రియల్టర్‌కి స్పాట్‌ పెట్టారు  మందలించినందుకే మరణశిక్ష..
  తాను మందలించడం వల్లే బిడ్డ విగతజీవిగా మారడం చూసి తల్లి ఆన‌సూయ బోరున విల‌పించింది. అంతే కాదు సురేష్ చనిపోయే ముందు చావు ఎప్పుడు వస్తుం దో ఊహించలేమని.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలనే కొటేషన్‌ని సురేష్ తన సెల్‌ఫోన్‌ స్టేటస్ పెట్టుకున్నాడని స్థానికులు తెలిపారు. సురేష్ తల్లి ఆన‌సూయ‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బిడ్డల మంచి కోరుతూ మందలించే తల్లిదండ్రులను బిడ్డలు శత్రువులుగా చూడవద్దని ...బిడ్డల కోసం జీవితాల్ని ధారబోసే తల్లిదండ్రులు చెప్పే మాటలను మంచి మనసుతో ఆలోచిస్తే ప్రాణాలు తీసుకునే పరిస్థితులు రావని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Kamareddy, Suicide, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు