SON PLANTING A MANGO TREE NEAR HIS MOTHER GRAVE IN NALLAGONDA DISTRICT SNR MDK
Telangana:అమ్మ నాటిన చెట్టును ఆమె సమాధి దగ్గర నాటించిన కొడుకు..ఎందుకంటే..
(అమ్మ ఆత్మ సంతృప్తి కోసం)
Nalgonda:పాతికేళ్ల క్రితం అమ్మ నాటిన మొక్క మామిడి చెట్టుగా మారి ఫలాలు ఇస్తోంది. ఇంతలోనే తల్లి శాశ్వతంగా దూరమైంది. తన తల్లి ఎంతో ఇష్టంగా చూసుకున్న మామిటి చెట్టను శాస్త్రీయంగా తొలగించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన చోట నాటించాడు.
(K.Veeranna,News18,Medak)
జన్మనిచ్చిన వాళ్లను పూజించాలి అంటారు. కాని ప్రస్తుత సమాజంలో పూజించడం కాదు కదా కనీసం వారి పోషించే తీరిక లేని స్థితిలో బిడ్డలు ఉన్నారు. స్వార్ధం, వ్యక్తిగత జీవితంపైన మక్కువ, డబ్బు ఆశ, అనేక కారణాలతో వృద్ధాప్యం రాగానే తల్లిదండ్రుల్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారు బిడ్డలు. పాతికేళ్ల క్రితం తల్లి స్వస్త్రాలతో నాటిన మొక్క నేడు మహావృక్షం అయింది. తల్లికి ఇష్టమైన చెట్టు, ఆమె ఎంతో మక్కువగా పెంచుకున్న చెట్టును ఆమె దగ్గరే ఉండేలా చేయాలనుకున్నాడు ఓ కొడుకు. జన్మనిచ్చిన తల్లి తనకు శాశ్వతంగా దూరమైనప్పటికి ..ఆమె నాటిన చెట్టును అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు చేర్చాలనుకున్నాడు. ఇందుకోసం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడో కొడుకు. సిద్దిపేట పట్టణం రాఘవేంద్రనగర్(Raghavendranagar)కు చెందిన గన్నమనేని కిరణ్కుమార్(Gannamaneni Kirankumar)హైకోర్టు(High Court)లో న్యాయవాది(Lawyer)గా పని చేస్తున్నారు. కిరణ్కుమార్ తల్లిదండ్రులు బాలకిషన్ రావు(Balakishan Rao), రాధ దంపతులు. గతేడాది కరోనా బారినపడిన తల్లి రాధRadha మృతి చెందారు. తల్లి అంత్యక్రియలను సిద్దిపేట(Siddipet)అర్బన్ మండలం బూరుగుపల్లి(Burugupalli)లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు లాయర్ కిరణ్కుమార్. కొడుకుగా తల్లికి ఇష్టమైన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు అడ్వకేట్ కిరణ్కుమార్.
తల్లికి ఇష్టమైన పని చేసిన కొడుకు..
తన తల్లి 25 సంవత్సరాల క్రితం ఎంతో ఇష్టంతో మామిడి మొక్క నాటి సంరక్షించారు. అది మహావృక్షమై నేడు ఫలాలను అందిస్తోంది. అలాంటి పండ్లు ఇచ్చే మామిడి చెట్టును తల్లి ఆత్మశాంతి కోసం మామిడి చెట్టు కొమ్మల్ని శాస్త్రీయ పద్దతిలో కట్ చేసి భారీ యంత్ర సాయంతో వెలికితీశారు. రాధకు అంత్యక్రియలు నిర్వహించిన చోట గుంత తవ్వించి అందులో మామిడి చెట్టును తిరిగి నాటించారు. సుమారు 4 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. అమ్మకు ఇష్టమైన చెట్టును ఆమె అంత్యక్రియలు నిర్వహించిన చోటే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కిరణ్ కుమార్ తెలిపారు.
అమ్మ ఆత్మ సంతృప్తి కోసం ..
మంచి బిడ్డలు తల్లి,తండ్రులు దూరమైతే వారి పేరుతో ఎన్నో సామాజిక,సేవా కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటాం. కాని ఓ కుమారుడు తల్లికి ఇష్టమైన చెట్టును ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన చోట నాటించి తనకు తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం ఓ అదృష్టం. బ్రతికి ఉండగా వాళ్లను బాగా చూసుకోవడం చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే..వాళ్లకు నచ్చినట్లుగా జీవించడమే మంచి బిడ్డల లక్షణం లాయర్ కిరణ్కుమార్ చేసిన పని కూడా అలాంటిదే అని చెప్పొచ్చు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.