( News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా)
ఇటివల ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపడం అలవాటుగా మారిపోయింది. తాము కొరుకుంటున్నట్టుగా తమది కాని ఆస్తి కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే వేధింపులు, ఇంకా వినకపోతే చివరకు ప్రాణాలు కూడా తీసేందుకు కన్నబిడ్డలే వెనకాడడం లేదు.. ఆస్తి తగదాల్లో ఇతరులు ప్రాణాలు తీసే సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నా మారుతున్న కాలంలో సొంతబిడ్డలే తల్లిదండ్రుల ఆస్తులపై కన్నేసి నిర్ధాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. ఇలాంటీ సంఘటనే తాజాగా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పోతులబొగూడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55) కొడుకు మురళి వద్ద వుంటోంది. అయితే భర్త చనిపోవడంతో ఆస్తి నాలుగు ఎకరాల భూమి మల్లమ్మ పేరు మీద రికార్డుకు ఎక్కింది... భూమితోపాటు కొన్ని బంగారు నగల కూడా ఆమె వద్ద ఉన్నాయి. అయితే తల్లివద్ద వున్న భూమి, బంగారంపై తన కొడుకు కన్ను పడింది. దీంతో తల్లి పేరుమీద ఉన్న భూమిని తన పేరున రిజిస్టర్ చేయించాలని , బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలంటూ మద్యం తాగి వచ్చి.. నిత్యం తల్లితో గొడవకు దిగేవాడు.
Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..
అయితే మద్యం మత్తులో పడిన మురళికి తల్లి ఆస్తిని ఇచ్చేందుకు నిరాకరించింది. అంతకు ముందే రెండు ఎకరలా భూమిని అమ్మి తాగుడు కోసం ఖర్చు పెట్టిన నేపథ్యంలోనే ఆమె ఆస్తిని బదలాయించేందుకు నిరాకరిస్తోంది... అయినా.. తాను చనిపోయిన తర్వాత ఆస్తులన్ని తనకే దక్కుతాయని కూడా నచ్చజెప్పినా...వినిపించుకోలేదు.. తాగుడుకు బానిసైన కొడుకు ఎక్కడ ఆస్తిని కరిగిస్తాడోనని ఆ తల్లి అతడికి అప్పగించేందుకు ససేమిరా అంది. దీంతో తల్లిపై కోపాన్ని పెంచుకున్న మురళి దారుణానికి ఒడిగట్టాడు.తల్లి బతికి ఉండగా తనకు ఆస్తి రాదని భావించాడు.. చనిపోతే ఎలాగైనా.. ఆస్తి తనకే దక్కుతుందని కుట్రకు తెరలేపాడు.. ఇందుకోసం ముందుగానే భార్యను పుట్టింటికి పంపించిన మురళి ఇంట్లో తల్లి ఒంటరిగా వున్న సమయంలో గొంతునులిమి హత్య చేశాడు... పట్టపగలే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.
Hyderabad : మైనర్ బాలిక ఒంటిపై పంటిగాట్లు..! ఆరు నెలలుగా బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి.
అనంతరం తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసాడు. అయితే అతడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఆస్తితో పాటు అటు తల్లిని కూడా పోగొట్టుకుని జైలుపాలయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Sangareddy