Nizamabad crime :జంట హత్యలు... మామతోపాటు బామ్మర్ధిని పొడిచి చంపిన అల్లుడు ..

నిజమాబాద్‌లో జంట హత్యలు

Nizamabad crime : నిజామాబాద్ జిల్లా లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది.. ఓ వ్యక్తి తన సొంత మామతోపాటు బావ మరిదిని పొట్టన పెట్టుకున్నాడు. చిన్నపాటి ఘర్షణలో ఇద్దరిని కత్తితో పొడిచాడు..దీంతో మామ స్పాట్‌లో చనిపోగా బామ్మర్ధి మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లా,
    న్యూస్ 18తెలుగు ప్రతినిధి :పి మహేందర్,

    స్వాతంత్ర్యదినోత్సం వేళ నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది..తన అత్తగారింటికి వచ్చిన అల్లుడు మద్యం మత్తులో మామతో పాటు అడ్డువచ్చిన బామ్మర్ధిని సైతం హతమార్చాడు. ఈనేపథ్యంలోనే డిచ్‌పల్లి ఎస్‌ఐ అంజనేయులు చెప్పిన వివరాలు ప్రకారం మహారాష్ట్రకు చెందిన సంజీవరావు షిండే (50) బతుకుదెరువు కోసం తన భార్య, కుమారుడు జిలాని షిండే (30)ల తీసుకొని డిచ్పల్లిలో చిన్న గుడారము ఏర్పాటు చేసుకొని గత కొద్ది రోజులుగా జీవనం సాగిస్తున్నాడు. అయితే వారం రోజుల క్రితం అల్లుడు శివానంద్(32) , కూతురు సోని తో డిచ్పల్లి వచ్చి తమ మామ వద్ద మకాం వేశాడు.

    మహారాష్ట్రలో బతుకుదేరువు లేక మామతో పాటు పని చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక మేస్త్రి వద్ద రోజు కూలీ పని చేస్తూ ఉన్నాడు...అయితే వచ్చిన వారం రోజులు బాగానే ఉన్న అల్లుడు శివానంద్ అకస్మత్తుగా హంతకుడిగా మారాడు..కూలిపనులకు వెళ్లివచ్చిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మామ, అల్లుడు, బావమరిది ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    ఈ నేపథ్యంలోనే అది తీవ్రరూపం దాల్చడంతో శివానంద్ దారుణంగా వ్యవహరించాడు. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో శివానంద్, బావమరిది జిలాని షిండేతోపాటు మామ సంజీవ్ పై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బావమరిది జిలాని షిండే సంఘటనా స్థలంలోనే మరణించగా.. మామ సంజీవరావు షిండేను హుటాహుటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..అయితే కత్తిపోట్లు బలంగా ఉండడంతో చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు..అయితే ఇద్దరి చావుకు కారణమై ఘర్షణకు సంబంధించి వివరాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:yveerash yveerash
    First published: