తల్లిదండ్రులకు తమ పిల్లలంటే ఎక్కడ లేని ప్రేమానురాగాలు ఉంటాయి. ఆ కన్న తల్లి తొమ్మిది నెలలు మోసి.. తన బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. కన్నతండ్రి తన బిడ్డల కోసం కావాల్సిన వన్ని తెచ్చిపెడతారు. తమ బిడ్డలు ప్రయోజకులు కావడానికి తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతుంటారు. ఒక్కొసారి అనుకొని ప్రమాదాలు, ఊహించని సంఘటనలలో పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. కొందరు రోడ్డు ప్రమాదాలు, అనుకొని ప్రమాదాలలో పిల్లలు చిక్కుకుంటారు. ఈ క్రమంలో వారు తిరిగి రాని లోకాలకు వెళ్తుంటారు.
అప్పుడు తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరంకాదు. కొందరు తమ బిడ్డలు ఉపయోగించిన వస్తువులను జాగ్రత్తగా పెడతారు. తమ పిల్లలకు ఇష్టమైన ప్రతి పనిని చేస్తుంటారు. దీంతో తమ బిడ్డ ఆనందపడతారని భావిస్తుంటారు. అయితే, ఇక్కడ సదరు కుటుంబ సభ్యులు తమ కొడుకు చనిపోయిన ఫ్లెక్సీలో అతని ఫెవరేట్ హీరో ఫోటోను ముద్రించారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. నల్లగొండలోని (nalgonda) మునిపంపుల గ్రామంలో మామిండ్ల శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి గతేడాది మే 5, 2021 న కరోనా మహమ్మారి కారణంగా మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. శ్రీకాంత్ గౌడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan kalyan) అభిమాని. దీంతో అతని కుటుంబ సభ్యులు,స్నేహితులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒక ఫ్లెక్సీని (flexy) చేయించారు. దానిలో తమ చనిపోయిన కుమారుడి ప్రథమ వర్ధంతి వివరాలు వేశారు. దీనితో పాటు అతని ఫెవరేట్ హీరో పవన్ కల్యాణ్ ఫోటోను కూడా వేశారు. తమ కుమారుడికి ఇష్టమైన పనిచేస్తే.. ఎక్కడున్న తమ కొడుకు సంతోషపడతారని కుటుంబ సభ్యులు భావించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.