SON AND DAUGHTER IN LAW HAVE FORGOTTEN HUMANITY FOR PROPERTY IN SURYA PETA THAT THE SON REFUSED TO FUNERAL TO HIS FATHER PRV
Suryapeta: ఆస్తి కోసం మానవత్వం మరిచిన కొడుకు, కోడళ్లు.. తండ్రి శవాన్ని ఇంట్లో పెట్టుకునే తల్లితో కొడుకు బేరసారాలు..
ప్రతీకాత్మక చిత్రం
ఆస్తి (Property) కోసం కొడుకు, కోడళ్లు మానవత్వాన్ని మరిచి పోయారు. బతుకంతా కష్టపడి ఆస్తులను కూడబెట్టిన పిల్లలను ప్రయోజకులను చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి నిరాకరించారు కొడుకు
ఆస్తి (Property) కోసం కొడుకు, కోడళ్లు మానవత్వాన్ని మరిచి పోయారు. బతుకంతా కష్టపడి ఆస్తులను కూడబెట్టిన పిల్లలను ప్రయోజకులను చేసిన తండ్రికి తలకొరివి పెట్టడానికి నిరాకరించారు కొడుకు(The son refused to do the funeral for the father). ఆస్తి పంపకాలు అయినా కూడా మరేదో కావాలని దహన సంస్కారాలు కూడా నిర్వహించలేదు. ఈ ఘటన ఇపుడు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు కూతుళ్లకు చెరో మూడెకరాలచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కొడుకులకు 25 ఎకరాలను పంచి ఇచ్చాడు (Distributed). వయసు మీద పడటంతో ఇంకో మూడెకరాలను ఓ కుమార్తెకు ఇచ్చి.. భార్యతో కలిసి ఆమె వద్ద ఉంటున్నాడు. ఆదివారం ఉదయం అనారోగ్యంతో ఆయన కన్నుమూశాడు. అయితే, కుమార్తెకు ఇచ్చిన మూడెకరాలు తమకు ఇవ్వాలని వృద్ధుడి కొడుకు, కోడళ్లు పట్టుబట్టారు. ఆ భూమిని తమ పేరున రిజిస్టర్ చేస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. రాత్రయినా వివాదం తేలకపోవడంతో ఫ్రీజర్‌లోనే మృతదేహాన్ని ఉంచారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
సూర్యాపేట (Surya peta) జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడేనికి చెందిన వేము రాంరెడ్డి (80), కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి నిరుడు విద్యుదాఘాతంతో చనిపోగా, మూడో కుమారుడు వెంకటరెడ్డి ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు నాగిరెడ్డి నిడమనూరు మండలం రాజన్నగూడేనికి పదేళ్ల క్రితం వలస వెళ్లాడు. పెద్దకుమారుడి భార్య నాగలక్ష్మి, మూడో కుమారుడి భార్య విజయ కందులవారిగూడెంలోనే నివసిస్తున్నారు.
నాగిరెడ్డి భూమి కొనుగోలు..
కుమార్తెల వివాహ సమయంలో రాంరెడ్డి వారికి చెరో మూడెకరాలు (Acres) ఇచ్చారు. ముగ్గురు కుమారులకు 25 ఎకరాల భూమిని సమానంగా పంచి ఇచ్చారు. వృద్ధ దంపతులు తమ జీవనోపాధికి రూ.1.50 లక్షలు తీసుకున్నారు. అయితే గతంలో రెండో కుమారుడు నాగిరెడ్డి (Nagireddy) మూడెకరాలను విక్రయిస్తుంటే, ఆ భూమిని తండ్రి కొనుగోలు చేసి భార్య కాంతమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆదివారం అనారోగ్యంతో రాంరెడ్డి మృతిచెందారు. అయితే, ఆ మూడు ఎకరాలు తనకు, ఇద్దరు కోడళ్లకు సమానంగా రిజిస్ట్రేషన్ చేస్తేనే అంత్యక్రియలు (Funeral) చేస్తానని కుమారుడు భీష్మించాడు.
పొలం రిజిస్టర్ చేసేది లేదని తల్లి కాంతమ్మ, ధనమ్మ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుమారుడు , కోడళ్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై గ్రామంలోనే కాకుండా.. చుట్టు పక్కల కూడా విమర్శలు మొదలయ్యాయి. తండ్రికి తలకొరివి పెట్టే సమయంలో ఇలాంటివి సెటిల్ చేసుకోవడం ఏమిటని.. తల్లి (Mother) బతికుండగానే ఆమె ఆస్తులు రాసివ్వాలని డిమాండ్ చేయడం ఏంటని మండిపడున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.