Home /News /telangana /

SOME VILLAGE FARMER OF NIZAMABAD CHANGING CROP FROM PADDY TO ONION VRY NZB

Nizamabad : ఫలిస్తున్న ప్రభుత్వ మంత్రాంగం.. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆ ఊరి రైతులు..ఏం పంట వేస్తున్నారంటే..

ఉల్లిపంట వేస్తున్న రైతులు

ఉల్లిపంట వేస్తున్న రైతులు

Nizamabad : యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించారు.. లాభసాటిగా ఉండే నిత్యవసర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉల్లిసాగుపై ఉత్సహం చూపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ( Mahender, news 18 Telugu Nizamabad )

    తెలంగాణ ప్ర‌భుత్వం వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని చెబుతుండడంతో..పాటు పంట కొనుగోళ్లు యాసంగిలో ఉండవని ఇప్ప‌టికే స్పష్టం చేసారు. దీంతో కొంతమంది రైతులు వరి పంటలు వేయగా మరికొంతమంది మాత్రం మెట్ట పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉల్లి సాగు చేస్తూ పంట మార్పిడికి ముందుకొచ్చారు. ఇలా వంద ఎకరాల్లో పంట మార్పిడి చేస్తూ  భూమి సారవంతానికి ప్రయత్నిస్తున్నారు. సన్ సీడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని విత్తన ఉల్లి సాగుకు శ్రీకారం చుట్టారు..  లాభాలు బాగుంటే వచ్చే ఏడాది విస్తీర్ణం పెంచేందుకు యోచిస్తున్నామ‌ని రైతులు  చెబుతున్నారు..

    నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, బోర్లలో పుష్కలంగా నీళ్లుండటంతో అధికశాతం మంది రైతులు వరికే మొగ్గు చూపారు. దీంతో ఎక్కడ చూసినా వరి నాట్లు కనిపిస్తున్నాయి. వరికి అలవాటు పడ్డ రైతులు కొత్త పంటలు వేస్తే ప్రయోగం ఫలిస్తుందో లేదోనన్న అనుమానంతో ధైర్యం చెయ్యలేదు. అయితే నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం ధర్మారం రైతులు పంట మార్పిడికి సై అన్నారు. యాభై మందికి పైగా రైతులు ఏకంగా వంద ఎకరాల్లో వరి పంటకు బదులు మెట్ట పంట సాగు చేస్తున్నారు. విత్తన ఉల్లి వేస్తూ మిగతా రైతులకు ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇతర పంటలు సాగు చేయాలని చూసినా విత్తనాలు లేక సంప్రదాయ వరికే అంతా జై కొట్టారు.

    Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి.. మరొకరు విషమం

    అందుకే మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తన ఉల్లిని సాగు చేయాలని ధర్మారం రైతులు భావించారు. దీంతో కొంత మంది రైతులు సంబంధిత కంపెనినీ సంప్రదించగా వారు విత్తన ఉల్లికి సంబంధించి అవగాహన కల్పించారు. పంట సాగు, పెట్టుబడి, దిగుబడి, ధర గురించి చెప్పారు. ధరపై కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  50 వేలకు క్వింటా చొప్పున విత్తన ఉల్లి తీసుకునేందుకు కంపెనీ వారికి రైతుల మధ్య ఓప్పందం కుదిరింది.  విత్తన ఉల్లి సాగు చేసేందుకు ఎక‌రాకు 45 నుంచి 50వేల వ‌ర‌కు ఖర్చు అవుతుంద‌ని రైతులు అంటున్నారు. ఎకరం విత్తనం కోసం పది క్వింటాళ్ల ఉల్లిగడ్డకు 30వేలు అవుతుంది..  మరో 15నుంచి 20వేల వరకు ఇతర మందులు, కూలీల ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    Adilabad : నువ్యుల నూనెతో ఆ దేవుడికి నైవేధ్యం... అది తాగిన తర్వాతే ఉత్సవం

    ప్రస్తుతం రైతులకు విత్తుకునేందుకు ఉల్లిగడ్డను కంపెనీయే అందించింది. హామీ కింద రైతుల నుంచి చెక్కు తీసుకుంది. దిగుబడి వచ్చినప్పుడు రైతులకిచ్చే నగదులో విత్తనం ఖర్చు తీసుకుంటారని రైతులు చెబుతున్నారు. 150రోజుల కాల వ్యవధిలో పంట చేతికి వస్తుంద‌ని రైతులు అన్నారు..  ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారని తెలిపారు.. సరాసరిన ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా చాలని రైతులు భావిస్తున్నారు. దీంతో పెట్టుబడి పోనూ ఎకరానికి  60 నుంచి ల‌క్ష వ‌ర‌కు లాభం వ‌స్తుంద‌ని రైతులు  చెబుతున్నారు.

    ఏళ్లుగా వరి పంటనే సాగు చేస్తుండటం వల్ల మందులు, రసాయనాల వినియోగం వల్ల నేల గుల్లబారిపోయిందని, దిగుబడి పెరుగుతున్నా మందుల వినియోగమూ అంతే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో పంటను మార్చడం వల్ల నేల సారానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లో విత్తన ఉల్లికి డిమాండ్ ఉండడంతోపాటు, భవిష్యత్ లోనూ మరింత డిమాండ్ వస్తుందని రైతులు అంచనా వేసి ఈ పంట వేసినట్టు చెబుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Farmers, Nizamabad, Paddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు