Traffic Challan: బైక్ నంబర్ ప్లేట్‌కు మాస్క్.. కేటుగాళ్ల కొత్త ఆలోచన

బైక్ నంబర్ ప్లేట్‌కు మాస్క్

Traffic Challans: నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు పెట్టి నడుపుతున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సింగ్నల్స్ వద్ద ఫోటో తీద్దామంటే నంబర్ కనిపించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఒకింత అసహనానికి గురవుతున్నారు.

 • Share this:
  ఇప్పటివరకు మాస్కులు కరోనా రాకుండా ఉండడానికి మనషులు, కొన్ని జంతువులకు, చివరికి పాములకు మాస్క్ తొడగడం చూశాం. కానీ పెద్దపెల్లి జిల్లా రామగుండం, గోదావరిఖని లో కొంతమంది మంది ఏకంగా తాము నడిపే బైకులకు కూడా మాస్కులు కడుతున్నారు. బైక్‌లకు మాస్కులు ఎందుకు కడుతున్నారు ? ఇదేం పిచ్చి అనుకునేరు ? ఇదంతా ట్రాఫిక్ పోలీస్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాళ్లు వేసిన కొత్త రకం చావు తెలివితేటలు. రామగుండం నగర పరిధిలో కొందరు బైక్‌ నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టి దర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి కేసులు నగరంలో పెరిగిపోతున్నాయి.

  చలాన్ల నుంచి తప్పించుకునేందుకు బైక్ నంబర్ కనబడకుండా నంబర్ ప్లేట్‌కు పెయింట్ వేయడం చాలాసార్లు చూశాం. కొంతమంది ఏదైనా బట్టను నంబర్ ప్లేట్‌కు అడ్డుపెట్టేవాళ్లు. మరికొందరు నంబర్‌ ప్లేట్‌లోని ఓ అంకెను తొలగించేవాళ్లు. ఇలా రకరకాల ఆలోచనలతో ట్రాఫిక్ చలాన్‌ నుంచి తప్పించుకునేవారు. కానీ ఇపుడు ఏకంగా మూతికి ఉన్న మాస్కులు తీసి బైక్‌ నంబర్ ప్లేట్‌కు కట్టి.. హెల్మెంట్ లేకుండా, ట్రాఫిక్ సింగ్నల్స్ జంప్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఇలా తిరిగే ద్విచక్ర వాహనాల ద్వారా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారారు.

  నంబర్ ప్లేట్స్ కు మాస్కులు పెట్టి నడుపుతున్న వాహనాలను ట్రాఫిక్ పోలిసులు సింగ్నల్స్ వద్ద ఫోటో తీద్దామంటే నంబర్ కనిపించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఒకింత అసహానికి గురవుతున్నారు. అసలే హెల్మెంట్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్సు లేకున్నా, బండికి ఆర్సీ లేకున్నా, ట్రాఫిక్ పోలీసులు వేల రూపాయల జరిమానాలు విధిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ఇలా మాస్కులు పెట్టి రోడ్స్‌పై రైయ్ రైయ్ అంటూ ఎంచక్కా బండ్లను ట్రాఫిక్ పోలీసుల కెమెరా కంటికి చిక్కకుండా తిరుగుతున్నారు. మరి పోలీసులు వీరికి ఎలాంటి ఫైన్స్ వేస్తారో చూడాలి.
  Published by:Kishore Akkaladevi
  First published: