పట్టాలు తప్పిన రైలు... ఆ రూట్‌లో రాకపోకలు ఆలస్యం...

Train Accident : ఈ ప్రమాదంతో దసరా సందర్భంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

news18-telugu
Updated: October 10, 2019, 5:44 AM IST
పట్టాలు తప్పిన రైలు... ఆ రూట్‌లో రాకపోకలు ఆలస్యం...
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - Rajendra B. Aklekar)
  • Share this:
Train derailment : మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దగ్గర్లో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అక్కడ సింగిల్ రైల్వే లైన్ ఉండటంతో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాచిగూడ నుంచీ గుంటూరు వెళ్లే ప్యాసెంజర్ రైలును... మహబూబ్‌నగర్ స్టేషన్‌లో నిలిపేశారు. దాదాపు రెండున్నర గంటలపాటూ ప్రయాణికులు రైల్లో ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసెంజర్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. దసరా సందర్భంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మన్యంకొండ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణికులను తరలించేందుకు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన్యంకొండకు అధికారులు 5 ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటుచేశారు. పట్టాలు తప్పిన రైలును రైల్వే పట్టాలు సరిచేసే మిషన్‌తో తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైలును పట్టాల పైకి ఎక్కించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం వల్ల కర్నూలు సిటీ-కాచిగూడ మధ్య వెళ్లే తుంగభద్ర ఎక్స్ ప్రెస్, కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్, రాయిచూరు- కాచిగూడ, కాచిగూడ- కర్నూలు సిటీ, కాచిగూడ-మైసూర్, ఓఖా-రామేశ్వరం,
యశ్వంత్‌పూర్-ఇండోర్ వంటి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గద్వాల వైపు వచ్చే 57305-గుంటూరు ప్యాసింజర్, 17027- తుంగభద్రను పాక్షికంగా రద్దు చేశారు. అలాగే 17603 యశ్వంత్‌పూర్ రైలు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరుతోంది. 17652-చెన్నై, 16353-నాగర్ కోయిల్, 12785-బెంగళూరు, 12797-వెంకటాద్రి రైళ్లను దారి మళ్లించారు. దక్షిణం వైపు వెళ్లే రైళ్లు దాదాపు 9.30 గంటలు ఆలస్యంగా వెళ్తున్నాయి.

 

Pics : రియల్ లైఫ్ బార్బీ గర్ల్ అంజెలికా క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>