Home /News /telangana /

SOME PEOPLE IN NIRMAL ARE COMMITTING UNETHICAL ACTS AT THE STATUES OF THE HEROES WHO PARTICIPATED IN THE FREEDOM STRUGGLE OF THE COUNTRY ADB PRV

Independence: ఇదేనా స్వతంత్ర భారతం..? వజ్రోత్సవాల వేళ మహనీయులకు అవమానం..!

భారత జాతీయ పతాకం

భారత జాతీయ పతాకం

దేశం కోసం, తమ వారి హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులకు ఆ ఏరియాలో అవమానం జరిగే రీతిలో కొందరు దుండగులు వ్యవహరించిన తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (Lenin. News18, Adilabad)

    ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం (Independence)  సిద్దించింది. తెల్లదొరల నుంచి విముక్తి లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యావత్ దేశమంతటా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నారు. స్వాంతంత్య్ర భారత వజ్రోత్సవాలను (India's Diamond Jubilee celebrations) ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం కూడా ద్విసప్తాహా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మహానీయుల (Freedom fighters) త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి పౌరుడిలో దేశభక్తి ని పెంపొందించేందుకు రోజువారిగా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఆ మహానీయులను అవమాన పరిచే సంఘటన నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

    నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న పలువురు మహానీయుల విగ్రహాలను మందుబాబులు అడ్డాగా మార్చుకొని అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, గిరిజన వీరుడు కొమురంభీం, సర్ధార్ సర్వాయి పాపన్న, తెలంగాణ సిద్దాంత కర్త ప్రొ. కె.జయశంకర్, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపుజీ విగ్రహాలు ఉన్నాయి. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉన్నా పట్టింపు లేకుండా మహానీయుల విగ్రహాలను కొందరు పోకిరీలు అడ్డాగా మార్చుకొని గత కొద్దిరోజులుగా మద్యం సేవించడంతోపాటు ఇతర అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ ఆ మహానీయులను అవమానపరుస్తున్నారు.



    ఇదిలా ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పలువురు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నాయకులు రాత్రి పూట మహనీయుల విగ్రహాల వద్ద మందు తాగుతున్న పోకిరీలను పట్టుకొని నిలదీశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న ఈ విగ్రహాల వద్ద చాలా మంది పోకిరీలు మద్యం సేవిస్తూ అసాంఘీక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తుడం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ ఆరోపించారు. పోలీసులకు చెప్పినా కూడా పట్టనట్లు వ్యవహరించారని పేర్కొన్నారు.

    నిరసన తెలుపుతున్న నాయకులు


    నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్.పి లు వెంటనే స్పందించి మహానీయుల విగ్రహాల వద్ద అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఆదివాసి నాయకులు మెస్రం ఆనంద్, మర్సకోల అశోక్, ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు సలాం వరుణ్, చహకటి సునీల్, బి. రాహుల్, కుడుమేత ప్రకాష్, మరప రోహిదాస్ల తో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. దుండగులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు