మూడేళ్లుగా కీడు.. ఇళ్లను వదిలి ఊరికి దూరంగా గిరిజనుల నివాసం.. ఆ గ్రామానికి ఏమైంది?

ఊరిని ఖాళీ చేసిన గిరిజనులు

పాటగూడ (కె) గ్రామంలో తాము గత మూడేళ్ల నుండి కొంత అనారోగ్యం పాలవుతుండటంతో తామే స్వయంగా నిర్ణయం తీసుకొనున్నామని స్థానికులు తెలిపారు. ఇళ్లను వదిలి గ్రామ శివారులోని ఓ పొలంలో గుడిసెలు వేసుకొని పాటగూడ (బి )గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని కుమ్ర మోతీరామ్ అనే స్థానికుడు తెలిపారు.

 • Share this:
  శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న నేటి ఆధునిక కాలంలోనూ ఇంకా మూఢ నమ్మకాలు, విశ్వశాలతో కొందరు కాలం వెల్లదీస్తున్నారు. అభివృద్ది ఫలాలను అందుకోలేకపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికి ఏజెన్సీలోని ఆదివాస్ గిరిజనులు మూఢ నమ్మకాలు, విశ్వాశాలతో అభివృద్దికి ఆమడ దూరంలో ఉండిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ, ఇంద్రవెల్లి(కె) గ్రామంలోని చోటుచేస్తుకున్న ఓ ఘటన అందుకు అద్దంపడుతోంది.

  ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ గ్రామానికి ఇంద్రవెల్లి(కె) అనే ఇంకో పేరు కూడా ఉంది. ఈ గ్రామంలో సుమారు 80 మందికి పైగా కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాతల కాలం నుండి నివసిస్తున్న ఈ పాటగూడ గ్రామంలోని కొలాం గిరిజనుల్లో ఓ కొత్త సమస్య వచ్చిపడింది. మూఢ విశ్వాసంతో గ్రామం రెండుగా చీలింది. కొలాం గిరిజనుల్లో కొందరు చిన్న చిన్న తప్పోప్పులను వారి మనస్సులో పెట్టుకొని గ్రామస్థుల మధ్య మనస్పర్థలు పెంచుకొని వారి మనసుకు తోచిన విధంగా చేస్తుంటారు. పాటగూడా - ఇంద్రవెల్లి (కే) గ్రామంలో కూడా ఇదే ఘటన జరిగింది.

  గ్రామంలోని కొంతమందికి ఒకరికొకరికి పడిరాక వారి మధ్య మనస్పర్థలు ఏర్పడంతో, గ్రామ పెద్దలు బైఠాయించి వారి తప్పొప్పులను ఒప్పించి ఏకం చేశారు. అయినా వారు కొద్ది రోజులే కలిసి ఉన్నారు. మళ్లీ వారి మధ్య మనస్పర్థలు రావాడం, ఆరోగ్యం బాగుండటం లేదని, మూడేళ్ళ నుండి ఏదో ఒక కీడు జరుగుతుందని భావించి 12 కుటుంబాలు పాటగూడ - ఇంద్రవెల్లి (కే) గ్రామాన్ని వదిలిపెట్టాయి. గ్రామ శివారులోని ఓ పొలంలో గుడిసెలు వేసుకుని మరో గ్రామంగా పాటగూడ (బి)ని ఏర్పాటు చేసుకున్నారు.

  కాగా, పాటగూడ (కె) గ్రామంలో తాము గత మూడేళ్ల నుండి కొంత అనారోగ్యం పాలవుతుండటంతో తామే స్వయంగా నిర్ణయం తీసుకొనున్నామని స్థానికులు తెలిపారు. ఇళ్లను వదిలి గ్రామ శివారులోని ఓ పొలంలో గుడిసెలు వేసుకొని పాటగూడ (బి )గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని కుమ్ర మోతీరామ్ అనే స్థానికుడు తెలిపారు. అసలు ఆ గ్రామస్థులతో వారికి ఎలాంటి గొడవలు గాని విద్వేషాలు గాని.. కోపతాపాలు లేవని పేర్కొన్నారు. కేవలం తమకు ఆరోగ్యం బాగులేక పోవడంతోనే స్వయంగా 12 కుటుంబాలు వెళ్లిపోయానని చెప్పారు. అందులో కుమ్ర వంశీయులు 10 మంది, కొడప వంశీయులు ఒకరు, ఆత్రం వంశీయులు ఒకరు, మొత్తం మీద 12 కుటుంబాలు వేరుగా వేరె గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.


  తమకు ప్రభుత్వమే అండగా నిలిచి తమకు కరెంటు, తాగునీరు, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవైపు ప్రపంచం ఆధునికతవైపు అడుగులువేస్తున్న కాలంలో.. ఇలా కొలాం గిరిజనులు మూఢ నమ్మకాలతో వెనుకబడుతన్నారు. ఇలాంటి గ్రామాల్లో ఐటిడిఏ అధికారులు పర్యటించి వారికి అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: