Home /News /telangana /

SOME BUSINESSES AND PEOPLE GETTING BENEFITTED BY NAGARJUNA SAGAR BY ELECTIONS IN TELANGANA AK

సాగర్ ఉప ఎన్నికలు.. కష్టకాలంలో వారికి అలా కలిసొస్తుందా ?

నాగార్జునసాగర్ ప్రతీకాత్మక చిత్రం

నాగార్జునసాగర్ ప్రతీకాత్మక చిత్రం

ఉప ఎన్నికల పుణ్యమాని సాగర్ నియోజకవర్గం సహా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వ్యాపారాలు కళకళలాడుతున్నాయి.

    ఎన్నికలు అంటేనే ఓ హంగామా. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడతారు ? అనే సంగతి పక్కనపెడితే.. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా.. అనధికారికంగా మాత్రం ఎన్నికల ద్వారా అనేక మందికి పని దొరకుతుంది. కొందరికి వ్యాపారం బాగా జరుగుతుంది. మరికొందరు పని లేకుండానే కడుపు నిండుతుంది. ప్రస్తుతం తెలంగాణలోజరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. ఉప ఎన్నికల పుణ్యమాని సాగర్ నియోజకవర్గం సహా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. సాగర్ నియోజకవర్గంలో మద్యం, మాంసం వ్యాపారం అనేక రెట్లు పెరిగింది.

    ఉద్యోగం లేని వాళ్లకు కూడా ఈ ఉప ఎన్నికల కారణంగా కొంతవరకు ఊరట లభిస్తుంది. సాగర్ నియోజకవర్గంతో పాటు సాగర్‌కు దగ్గరగా ఉండే మిర్యాలగూడలో హోటల్స్ బిజినెస్ కూడా బాగా సాగుతోంది. సాగర్ ప్రచారంలో పాల్గొంటున్న నేతల్లో ఎక్కువమంది బస చేసేందుకు మిర్యాలగూడను ఎంచుకుంటున్నారు. దీంతో అక్కడ హోటల్స్ అన్ని మరికొన్ని రోజుల వరకు పూర్తిస్థాయిలో బుక్ అయ్యాయి. ఇప్పటికీ కొందరు గదులు కావాలని వస్తున్నారని.. అయితే తమ దగ్గర రూమ్స్ లేవని హోటల్ యజమానులు చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలు దగ్గరపడితే తమ మద్యం, మాంసం విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని.. సాగర్‌తో కూడా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ దీని ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Nagarjuna Sagar By-election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు