హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : అర్జెంట్‌ కావడంతో ఆ పని మీద వెళ్లి .. తుపాకీ పోగొట్టుకున్న సైనికుడు

Telangana : అర్జెంట్‌ కావడంతో ఆ పని మీద వెళ్లి .. తుపాకీ పోగొట్టుకున్న సైనికుడు

Gun Missing

Gun Missing

Telangana: ఓ సైనికుడి తుపాకీ పోయింది. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కాస్త ఏమరపాటుగా ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు గన్ మాయం చేసినట్లుగా బాధితుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోయిన తుపాకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Zahirabad (Zaheerabad), India

(K.Veeranna,News18,Medak)

తుపాకీ పోయింది. ఓ సైనికుడిSoldier గన్(Gun) మిస్సైంది. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుంటే అర్జెంట్‌ కావడంతో అక్కడికి వెళ్లాడే ఇంతలోనే ఊరికి వెళ్లాల్సి బస్ రావడంతో హడావుడిలో తుపాకీ మర్చిపోయి బస్సెక్కాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చేతిలో తుపాకీ లేకపోవడంతో గమనించి వెంటనే వెనక్కి వచ్చాడు. తాను పెట్టిన చోట తుపాకీ లేకపోవడంతో వేరే గత్యంతరం లేక పోలీస్‌ స్టేషన్‌(Police station)కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. సైనికుడు పోగొట్టుకున్న తుపాకీ కోసం జహిరాబాద్(Zahirabad)పోలీసులు వెదుకుతున్నారు.

Telangana : అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా..?

తుపాకీ పోగొట్టుకున్న సోల్జర్..

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సికిందర్ అలీ ఆర్మీలో సైనికుడిగా పని చేస్తున్నాడు. అతను శనివారం స్వగ్రామానికి వెళ్లడానికి జహిరాబాద్‌లో నిజామాబాద్ బస్సేందుకు చూస్తున్నాడు. ఇంతలో టాయిలెట్‌కి రావడంతో తన దగ్గరున్న తుపాకీ బస్టాండ్‌లో పెట్టి పబ్లిక్ టాయ్‌లెట్‌కి వెళ్లాడు. సికిందర్ అలీ పని పూర్తి చేసుకొని వచ్చే సరికి బస్టాండ్‌లో బస్ రెడీగా ఉండటంతో అది ఎక్కేశాడు. బస్ నారాయణఖేడ్‌ వరకు చేరుకున్న తర్వాత తన తుపాకీ గుర్తుకు వచ్చింది. వెంటనే బస్‌ దిగి వెనుక్కు వచ్చాడు. తాను పెట్టిన చోట తుపాకీ లేకపోవడంతో ఖంగుతిన్నాడు. వెంటనే జహిరాబాద్ బస్టాండ్‌లో అంతా వెదికాడు. అక్కడున్న వాళ్లను విచారించాడు. గన్‌ దొరక్కపోవడంతో జహిరాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు సికిందర్ అలీ.

టాయిలెట్‌కి వెళ్లి వచ్చేలోపే..

సైనికుడు సికిందర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జహిరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తుపాకీ మర్చిపోయాడా లేక సికిందర్ అలీ టాయిలెట్‌కి వెళ్లిన సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు గన్‌ని చోరీ ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు వెదుకుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Sangareddy, Telangana News

ఉత్తమ కథలు