భారత్‌లో ట్రంప్ టూర్.. చిలుకూరులో సాఫ్ట్‌వేర్ భక్తుల మొక్కులు

చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీగా పేరుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయదలచుకున్న వారు.. ఇక్కడకు వచ్చి 11 సార్లు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటే వీసాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

news18-telugu
Updated: February 21, 2020, 6:37 PM IST
భారత్‌లో ట్రంప్ టూర్.. చిలుకూరులో సాఫ్ట్‌వేర్ భక్తుల మొక్కులు
ట్రంప్, చిలుకూరు బాలాజీ ఆలయం
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఆయన ఇండియాకు వస్తున్నారు. ఐతే ట్రంప్ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు క్యూ కడుతున్నారు. సాధారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరికలు తీరిన తర్వాత మరోసారి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఐతే ట్రంప్ పర్యటన నేపథ్యంలో శివరాత్రి వేళ చిలుకూరు బాలాజీ భక్తులు రెండు ప్రదక్షిణలు ఎక్కువ చేశారు. ఇక విదేశాలకు వెళ్లదలచుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామికి మొక్కుకున్నారు.

చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీగా పేరుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయదలచుకున్న వారు.. ఇక్కడకు వచ్చి 11 సార్లు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటే వీసాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలా ఎంతో మందికి వీసాలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లదలచుకున్న భక్తులు ఇండియాలో ట్రంప్ పర్యటన సందర్భంగా ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. H1B వీసాలను తగ్గించాలన్న ట్రంప్ ఆలోచనా ధోరణిని, భారతీయుల పట్ల ట్రంప్‌ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ప్రార్థించారు. అంతేకాదు భారత్ పట్ల అమెరికాకు గౌరవం పెరగాలని.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలని కోరుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా ఆయనపై స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని భక్తులు రెండు ప్రదక్షిణలు ఎక్కువ చేశారు. భారతీయులను ఈ మూడేళ్లలో ఎక్కువగా వేధించారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల వీసాలు రద్దు చేశారు. ఆయన మానసిక స్థితి మారాలని కోరుకున్నారు. ఈ దేశం పట్ల ట్రంప్‌నకు గౌరవం పెరగాలని ప్రార్థించారు.
రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు


చిలుకూరు బాలాజీని నిత్యం 2వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. వారిలో ఎక్కువ మంది అమెరికా వీసా, ఆరోగ్య సమస్యలు, పోటీ పరీక్షలు, కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో స్వామి వారి ఆశీర్వాదం తీసుకునేందుకే వస్తుంటారు. ఇక శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో దాదాపు 5,000-8,000 మంది భక్తులు చిలుకూరును సందర్శిస్తారు. ఇతర ఆలయాల మాదిరిగా ఇక్కడ హుండీలు ఉండవు. కేవలం ప్రదక్షిణలు చేసే స్వామి వారికి మొక్కుకుంటారు భక్తులు.ఇక శివరాత్రి పర్వదినాన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివచ్చారు. తమ వీసాలు త్వరగా అందేలా ఆశీర్వదించాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు స్వామి వారిని కోరుకున్నారు. కాగా, అమెరికా ప్రతిఏటా 85వేల h1B వీసాలు జారీ చేస్తుండగా అందులో 70శాతం భారతీయులకే ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటనలో ట్రంప్, మోదీ మధ్య H1B వీసాలపైనా చర్చలు జరిగే అవకాశముంది.

వీడియో ఇక్కడ చూడండి:
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు