షాద్‌నగర్ లైంగిక దాడి బాధితురాలు ఆత్మ‌శాంతికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌ క్యాండిల్ ర్యాలీ

ఐటీ కారిడ‌ర్లో కూడా ప‌లు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు ఉన్నాయ‌ని ఆయా చోట్ల సీసీ కెమెరాలు వంటి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను పునఃప‌రిశీలించాల‌ని ఈ సంద‌ర్భంగా టెకీలు కోరారు.

news18-telugu
Updated: November 30, 2019, 10:50 PM IST
షాద్‌నగర్ లైంగిక దాడి బాధితురాలు ఆత్మ‌శాంతికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌ క్యాండిల్ ర్యాలీ
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మహిళలు
  • Share this:
మాన‌వ మృగాల చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన షాద్‌నగర్ లైంగిక దాడి బాధితురాలు హత్యోదంతంలో నిబంధ‌నలు ప‌క్క‌న‌పెట్టి అయినా క‌ఠినంగా దోషుల‌ను శిక్షించాల‌ని ప‌లువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిన‌దించారు. బాధితురాలు ఆత్మ‌శాంతి చేకూరాల‌ని హైద‌రాబాద్ ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ చేప‌ట్టారు. వ‌రంగ‌ల్‌లో యాసిడ్ దాడి జ‌రిగిన స‌మ‌యంలో పోలీస్ ఉన్న‌తాధికారిగా ఉన్న‌ స‌జ్జ‌నార్ గారు ఇప్పుడు సైతం అదే రీతిలో త‌గు చ‌ర్య‌లు తీసుకొని...ఇలాంటి మాన‌వ మృగాల‌కు త‌గు శిక్ష విధించాల‌ని కోరారు. ప్రియాంక రెడ్డి నిందితుల‌ను క్ష‌మించ‌వ‌ద్ద‌ని వారు స్ప‌ష్టం చేశారు.

ఐటీ కారిడ‌ర్లో కూడా ప‌లు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు ఉన్నాయ‌ని ఆయా చోట్ల సీసీ కెమెరాలు వంటి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను పునఃప‌రిశీలించాల‌ని ఈ సంద‌ర్భంగా టెకీలు కోరారు. పోలీసులు ర‌క్ష‌ణ కోసం అందిస్తున్న నంబ‌ర్ల‌ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌తో పాటు మ‌హిళ‌లంతా సేవ్ చేసుకోవాల‌ని, ఆప‌ద‌లో వారిని సంప్ర‌దించాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు. ఐటీ ఉద్యోగులు వివిధ సాంకేతిక అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల కోరారు. ఈ సంద‌ర్భంగా ర‌మ్య‌, పూజా, సౌమ్య, హారిక‌, ప్ర‌దీప్ నీల‌గిరితో పాటుగా ప‌లువురు టెకీలు పాల్గొన్నారు.
First published: November 30, 2019, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading