Telangana: బ్యాంక్ లోన్ రాలేదని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణం.. ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ఇంటి నిర్మాణానికి బ్యాంక్ లోన్ కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని అప్రూవ్ చేయలేదు. ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుందని తీవ్ర కలత చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

 • Share this:
  ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేది పెద్దలు అంటుంటారు. కానీ ఇల్లు కట్టాలంటే మాములు విషయం కాదు. సేవింగ్ చేసిన డబ్బులు కూడా సరిపోకపోవచ్చు. దాని కోసం మరో ప్రత్యామ్నయం వైపు చూస్తుంటారు. ఇలా బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. చాలామందికి అన్ని డక్యుమెంట్స్ ఉంటే అప్రూవ్ అవుతుంది. లేదా రిజెక్ట్ చేస్తారు. ఇలానే ఒకటి.. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణానికి అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువగా అవుతోంది. అందువల్ల అతడు బ్యాంక్ లోన్ కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ బ్యాంక్ నుంచి లోన్ అప్రూవ్ కాలేదు. దాంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుందని తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి.

  మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైతన్య హౌసింగ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన కొత్తగా ఒక ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అందుకోసం తన వద్ద ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేశాడు. ఇంటి నిర్మాణం సగం అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ కోసం అప్లై చేయగా లోన్ అప్రూవ్ కాలేదు. దాంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుందని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర కలత చెందాడు.

  డబ్బులు లేకుండా నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియక.. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషాద ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
  Published by:Veera Babu
  First published: