Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. ఏటీఎం సెంటర్ వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి.. చికిత్స పొందుతూ..

Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. ఏటీఎం సెంటర్ వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి.. చికిత్స పొందుతూ..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలోకి వెళ్లిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టారు. అతని వద్ద ఉన్న డబ్బులు, పర్సుతో పాటు అతని చేతికి ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

  • Share this:
    అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే నెల జీతం డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్ లోకి వెళ్లాడు. డబ్బులు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు అతడి వద్దకు వచ్చారు. అతడిని దారుణంగా కొట్టారు. అంతేకాకుండా అతని వద్ద ఉన్న డబ్బులు, బంగారం, పర్సును దోచుకొని పారిపోయారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లో మెహదీపట్నం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్నిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రమేష్ కుమార్ హైదరాబాద్ మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంకు ఎటీఎం డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చాడు. అక్కడకు మరో ముగ్గురు వచ్చి అతడిపై వచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపరచడంతో పాటు అనంతరం అతని వద్ద ఉన్న డబ్బులు, పర్సు, రెండు బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్ ను లాక్కొని అక్కడి నుంచి ముగ్గురు అగంతకులు పరారయ్యారు.

    స్థానికులు వెంటనే రమేష్‌ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే రమేష్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెహదీపట్నం అయోధ్య నగర్ లో నివాసం ఉంటున్న అతడికి 8 నెలల క్రితం వివాహం జరిగింది. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అతడికి అంతకముందు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. 302 , 394 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    మృతుడు రమేష్ ఎక్కడెక్కడ వున్నాడు ఆ రోజు ఏమి జరిగింది సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్నారు.
    Published by:Veera Babu
    First published: