SOFTWARE EMPLOYEE COMMITS SUICIDE BY CORONA POSITIVE IN HYDERABAD
Hyderabad : కరోనాకు భయపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని..?
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : కరోనాకు ఇంకా భయపడుతున్నారు.. అది సోకిన వారు వ్యక్తిగతంగా ఆందోళన చెందుతున్నారు.. ఇలా నగరంలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహిళ కరోనాతో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
కరోనా మొదటి,రెండవ వేవ్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైరస్ ప్రభావంపై అనేక పాఠాలు నేర్చుకున్నారు.. దీంతో పాటు కరోనాపై ఓ అవగాహన కూడా ప్రజల్లో వచ్చింది. ఓ వ్యాక్సిన్, మరోవైపు మెడిసిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సరైన చికిత్స లభిస్తోంది. దీంతో ధర్డ్ వేవ్ ఇంత పెద్ద ఎత్తున ప్రభలుతున్నా ప్రజల్లో ఉన్న అవగాహన మేరకు ట్రీట్ మెంట్ తీసుకుంటూ పిల్లల నుండి పెద్దల వరకు వైరస్ మహమ్మరీ నుండి బయటపడుతున్నారు. ఇంత అవగాహన ఉన్నా.. నగరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతికి కరోనా సోకడంతో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే భద్రాచలం జిల్లాకు చెందిన అలేఖ్య అనే యువతి హైదరాబాద్ నగరంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కనాజీగూడలోని నివాసం ఉంటుంది. కాగా అలెఖ్యకు నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కరోనా టెస్టులు చేయించుకుంది. దీంతో పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఇక అప్పటి నుండి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతుంది. ఇక తల్లిదండ్రులతో కూడా రెండు రోజుల పాటు మాట్లాడింది. ఇలా ఈ నెల 23 వరకు వారితో మాట్లాడుతునే ఉంది. కాని సడెన్‌గా ఆ రోజు నుండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం లేదు.. దీంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేరుగా ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడడంతో షాక్‌కు గురయ్యారు. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కరోనాతో ఆందోళనకు గురైందా.. లేక ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ఆమె మొబైల్ డాటాను పరీశీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.