పిల్లల కోసం పాముతో పోరాడిన శునకం... చివరకు

శునకం తన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం ఆపలేదు. చాలా సేపటి తర్వాత పాము తోక ముడిచి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: October 12, 2019, 2:00 PM IST
పిల్లల కోసం పాముతో పోరాడిన శునకం... చివరకు
కుక్కపిల్లల్ని కాటేసిన నాగుపాము
news18-telugu
Updated: October 12, 2019, 2:00 PM IST
ఎక్కడైనా తల్లి ప్రేమను వెలకట్టలేం. మనుషులైనా సరే.. జంతువులైన సరే తమ పిల్లల ప్రాణాల కోసం తల్లి ప్రాణాలని సైతం పణంగా పెట్టి పోరాడుతోంది. అవసరం అయితే ఎంతటి భయానక పరిస్థితినైనా ధైర్యంగా ఎదురుచూస్తుంది.అలాగూ ఓ శునకం తన పిల్లల్ని పామునుంచి కాపాడుకునేందుకు చాలాసేపు పోరాడింది. రెండు రోజుల క్రితం జన్మనిచ్చిన ఆ శునకం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వాటి దగ్గర ఓ నాగుపాము ఉండటం చూసి కంగారు పడింది. ఆ పామును అక్కడ్నుంచి పారద్రోలేందుకు గట్టిగానే పోరాడింది.

హైదరాబాద్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని ఆనుకుని ఆదర్శనగర్‌ కాలనీ ఉంది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం ఆవరణలో పెద్ద సంఖ్యలో పాములున్నాయి. శుక్రవారం ఓ పాము ఆదర్శనగర్‌ కాలనీలోకి చొరబడింది. అక్కడి రోడ్డు నెంబరు-2లోని ఓ వీధిలో ఉన్న షెడ్డులోకి పాము చేరింది. ఆ షెడ్డులో రెండు రోజుల క్రితం ఓ శునకం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. పాము రావడం చూసిన ఆ శునకం అరవడం ప్రారంభించింది. పాము కూడా బుసలు కొడుతూ అక్కడే నిలబడింది.

ఇలా చాలాసేపు కుక్క అరుస్తూనే ఉంది. ఈలోగా కాలనీవాసులు, ఆర్టీఏ కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కుక్క ఎంతగా అరుస్తున్న పాము బెదరలేదు. శునకం తన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం ఆపలేదు. చాలా సేపటి తర్వాత పాము తోక ముడిచి వెళ్లిపోయింది. కానీ అంతకు ముందే రెండు పిల్లల్ని పాము కాటేయడంతో అవి చనిపోయాయి. చివరకు ఒకే ఒక కుక్క పిల్ల మాత్రమే ప్రాణాలతో బయటపడింది.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...