హోమ్ /వార్తలు /తెలంగాణ /

Snake : వాట్ ఏ డేర్ పర్సన్... నడుస్తున్న వ్యక్తి కాళ్లకు చుట్టుకున్న పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...(వీడియో)

Snake : వాట్ ఏ డేర్ పర్సన్... నడుస్తున్న వ్యక్తి కాళ్లకు చుట్టుకున్న పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...(వీడియో)

Snake : వాట్ ఎ డేర్ పర్సన్...

Snake : వాట్ ఎ డేర్ పర్సన్...

Snake :నడుస్తున్న వ్యక్తి కాళ్లకు పాము చుట్టుకుంటే..అది నిజంగా నరకమే... ధైర్యం లేని వారైతే ప్రాణాలు అరచేతిలో ట్టుకుని పరుగులు పెట్టాల్సిందే...కాని ఓ వ్యక్తి మాత్రం తనకు అకస్మాత్తుగా చుట్టుకున్న పాము అంతు చూశాడు..దాన్ని నేలకేసి చంపేవరకు వదిలిపెట్టలేదు..

ఇంకా చదవండి ...

  కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.. నడుస్తున్న రాజయ్య అనే కాళ్ల సందుల్లోకి ఓ పాము దూరింది.. దాంతో పాటు అది పైకి ఎకబాకుతుండడంతో రాజయ్య అప్రమత్తమయ్యాడు..తనపై పాము పారుతుందనే ఏమాత్రం భయం లేకుండా పాము తలను గట్టిగా పట్టుకున్నాడు. కాని పాము మాత్ర మొత్తం రెండు మెలికలతో తన కాలుకు చుట్టుకుంది. ఎంత గుంజినా బయటకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి నుండి వెళుతున్న మరోవ్యక్తి రాజయ్యకు సహాయపడ్డాడు. రాజయ్య పాము తలకాయను గట్టిగా పట్టుకోవడంతో మరో వ్యక్తి దాని తోకను పట్టుకుని కాలునుండి బయటకు గుంజాడు..

  ఆ తర్వాత పాము తలకాయను విరిచినా అది మాత్రం చావలేదు..దీంతో కిందకి వదలివేయడంతో పాము పారిపోయేందుకు ప్రయత్నించింది.. దీంతో మరోసారి తన వద్ద కట్టెతో పాము తలపై కొట్టి చంపాడు. అయితే అంత పెద్ద పాము రాజయ్య కాళ్లకు ఎలా చుట్టుకుందనేది ప్రశ్నగా మారింది.. సాధారణంగా పాములు తన దారిన అవి పొతాయి..సడన్ వచ్చి మనిషి కాళ్లమీదకు ఎక్కే ప్రయత్నం చాలా అరుదుగా ఉంటుంది.  ఇటివల వర్షాకాలం కావడంతో పుట్టలో నుండి బయటకు వస్తున్న పాములు టూ వీలర్ సీట్ల కింద ఉండడంతోపాటు పాటు దారి వెంట వెళుతున్న బైక్‌లకు కూడా చుట్టుకోవడం సాధరణంగా మారిపోయింది. కాని నడుస్తున్న వ్యక్తి కాళ్లకు పాము చుట్టుకోవడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ వ్యక్తి పాము నిర్ధాక్షిణ్యంగా చంపడంపై కూడా మరి కొంత మంది పెదవి విరుస్తున్నారు. పామును వదిలిపెడితే దాని దారిన అది పోయోదని కామెంట్స్ చేస్తున్నారు.

  కాగా ఇటివలే తమిళనాడుకు చెందిన ఓ ఏడు సంవత్సరాల బుడ్డోడు తాను ఆడుకుంటుంటే కరిచిన పామును మరి వెతికి వెటాడి దాన్ని చంపాడు .అనంతరం పామును తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు నేరుగా పామును తీసుకుని ఆసుపత్రి వెళ్లడం సంచలనంగా మారింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Snakes

  ఉత్తమ కథలు