Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 21, 2019, 6:22 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్లో మెట్రో రైళ్లు... మార్నింగ్ అంతా సేవలు అందించి... రాత్రివేళ మాత్రం రెస్ట్ తీసుకుంటాయి. ఐతే... మెట్రోరైలు సేవలు ఆపేసినప్పుడు... ట్రైన్ డోర్లు, విండోలూ అన్నీ మూసివేసి ఉంటాయి. దిల్సుఖ్నగర్లోని ఆ మెట్రో రైలులోకి ఎప్పుడు దూరిందో, ఎలా దూరిందో గానీ ఓ పాము దూరింది. రైలు లోపల తిరుగుతున్న పామును ప్రయాణికులు చూశారు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. లక్కీగా ఆ టైంలో... ఆ ట్రైన్లో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. అలర్టైన రైలు అధికారులు... రైలు ఎల్బీనగర్ వెళ్లగానే... అక్కడ దాన్ని ఆపేశారు. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత... రైలు మొత్తం చెక్ చేశారు. ఎక్కడా పాము కనిపించలేదు. దాంతో... ప్రయాణికులు అబద్ధం చెప్పారేమోనన్న డౌట్ వచ్చింది. కానీ... ఒకరిద్దరు కాదు... చాలా మంది ప్రయాణికులు తాము పామును చూశామనీ... అది సీట్ల కింద నుంచీ వెళ్తోందని చెప్పడంతో... నిజంగానే పాము దూరిందని నిర్ధారణకు వచ్చారు. మరైతే ఆ పాము ఏమైంది? ఎటు వెళ్లింది? అన్నది అర్థం కాలేదు. విషయం తేలేవరకూ ఆ ట్రైన్ నడపకూడదని డిసైడయ్యారు.
అధికారులు ఐదు రోజులుగా వెతికినా పాము కనిపించలేదు. తాజాగా స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి కొన్ని ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించడంతో... పాము ఎక్కడున్నది తెలిసింది. వెంటనే దాన్ని ప్రాణాలతో పట్టుకున్నారు. మొత్తంగా ఆరు రోజులు చిక్కకుండా తప్పించుకున్నపాము... ఎట్టకేలకు చిక్కింది. దాన్ని అడవుల్లో వదిలేయనున్నారు.
ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యం అన్నారు మెట్రో రైలు అధికారులు. అందుకే పాము అన్ని రోజులు కనిపించకపోయినా... రైలును నడపకుండా... క్లారిటీ వచ్చే వరకూ నిలిపేసినట్లు తెలిపారు. అందువల్ల ప్రయాణికులు ఇలాంటి విషయాలపై ఆందోళన చెందకుండా... హాయిగా మెట్రో రైలులో ప్రయాణించాలని కోరారు.
Published by:
Krishna Kumar N
First published:
August 21, 2019, 6:22 AM IST