శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం రన్‌వేపై ల్యాండయిన సమయంలో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. దాన్ని గమనించిన విమాన పైలట్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. విమానంలో 155 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.