Home /News /telangana /

SMART PHONE BOOKING ONLINE SOAP DELIVERY IN ADILABAD DISTRICT SNR ADB

Telangana : ఆదిలాబాద్‌ జిల్లాలో కస్టమర్ ఫోన్ ఆర్డర్ చేస్తే .. ఏం వచ్చిందో తెలుసా

(సెల్‌ఫోన్‌కు బదులు సబ్బు డెలవరీ)

(సెల్‌ఫోన్‌కు బదులు సబ్బు డెలవరీ)

OMG: రిన్‌ సబ్బు ఖరీదు 6100రూపాయలు. అదేంటని ఆశ్చర్యపోకండి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే ...10రూపాయల రిన్‌ సబ్బును ప్యాక్ చేసి పంపింది ఓ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్. తనకు జరిగిన మోసంతో ఖంగుతిన్న బాధితుడు వీడియోని అందరికి షేర్ చేశాడు. ఇలాంటి మోసాలకు ఎవరూ బలికావద్దని పిలుపునిచ్చాడు.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..ఏదైనా కాళ్ల దగ్గరకు తెప్పించుకోవచ్చు అనే విధంగా సర్వీసులు పెరిగాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్, డోర్‌ డెలవరీ, సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు సీజనల్‌ ఆఫర్లు ప్రతి ఒక్కరిని ఆన్‌లైన్‌ షాపింగ్‌ దారిలోకి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సౌకర్యాలు, ఆఫర్లకు టెంప్ట్ అయిన ఓ సగటు వ్యక్తి అత్యంత దారుణంగా మోసపోయాడు. ఆదిలాబాద్‌లో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌(Online) మోసానికి గురైన వ్యక్తి పేరు పంజరి భీమన్న( Panjari Bhimanna). ఆదిలాబాద్adilabad జిల్లా ఉట్నూరు(Utnoor)కి చెందిన యువకుడు వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌ షాపింగ్ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌లో సుమారు 6100 రూపాయల విలువ చేసే వీవో వై83 మొబైల్‌(Vivo Y83 Mobile‌)ని బుక్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ..ఆన్‌లైన్‌ షాపింగ్(Online shopping) ఎంత సౌకర్యంగా, సులభంగా ఉంటుందో అక్కడ జరిగే మోసం కూడా అంతే ఉంటుందని గ్రహించలేకపోయాడు బాధితుడు పంజరి భీమన్న.

    ఇది చదవండి : సిద్దిపేట జిల్లాలో ఎలక్ట్రిక్‌ బైకులోని బ్యాటరీ బ్లాస్ట్ ..బైకు, ఇల్లు రెండూ దగ్ధం



    ఆన్‌లైన్‌లో అడ్డగోలు మోసం..
    వేలకు వేలు డబ్బులు పోసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన భీమన్నకు ఐదు రోజుల తర్వాత కొరియర్‌లో స్మార్ట్ ఫోన్ డెలవరీ చేశారు. అయితే ఆశగా ఫోన్‌ బాక్స్ ప్యాక్ తీసి చూసిన యువకుడు షాక్ అయ్యాడు. అందులో వీవో వై83 మొబైల్‌కి బదులుగా బట్టలు ఉతికే సబ్బును పెట్టి ప్యాక్ చేసి పంపారు. 6100 రూపాయలు పెట్టి ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ షాపింగ్ చేస్తే పది రూపాయల రిన్ సబ్బు పంపడంతో బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన మోసాన్ని వీడియో తీసి మీడియా, సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేశాడు. తనకు న్యాయం జరగాలని..ఇలాంటి మోసాలకు ఎవరూ బలికావద్దని కోరుతున్నాడు భీమన్న.



    ఆరు వేలకు బట్టల సబ్బు..
    ఆన్‌లైన్‌ షాపింగ్ అనగానే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి కావాల్సిన వస్తువు కంపెనీ,ఫీచర్స్‌ ఆధారంగా వెబ్‌సైట్‌లోని కంపెనీ క్యాట్‌లాగ్‌లో చూసుకొని సెలక్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. నచ్చకపోతే నిర్ణీత గడువులో వెనక్కి పంపించే సౌకర్యం కూడా ఉండటంతో ఎక్కువగా మొబైల్స్ విషయానికి వచ్చే సరికి ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌లో ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇలాంటి చేదుఅనుభవం ఎదురవదు కాని...కొన్ని చోట్ల మాత్రం అమాయకులే ఆన్‌లైన్‌ మోసగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి కస్టమర్‌ కేర్ ద్వారా ఫీడ్‌ బ్యాక్ ఉండే సంస్థల వస్తువులను మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Online shopping, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు