Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రమాదం..

ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైల్ డోర్ మీద ఉన్న క్యాబిన్ ఊడి పడిపోయింది. పెద్ద శబ్దంతో క్యాబిన్ ఊడి పడిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

news18-telugu
Updated: October 18, 2019, 9:53 PM IST
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రమాదం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైల్ డోర్ మీద ఉన్న క్యాబిన్ ఊడి పడిపోయింది. పెద్ద శబ్దంతో క్యాబిన్ ఊడి పడిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనిక అనే యువతిపై పడ్డాయి. నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో పిల్లర నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పుడు డోర్ క్యాబిన్ ఊడిపడడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాదీ ప్రయాణికులు ఎక్కువగా మెట్రో రైల్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈనెల 12న ఉదయం 10:30 గంటలకు ప్యారడైజ్ వద్ద మెట్రోరైలు ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టారు.ఆగిన మెట్రో రైలును ... మరో రైలు ద్వారా తరలించారు. మరమ్మత్తు చేసినప్పటికీ కదలకపోవడంతో వేరే ట్రైన్ ని రప్పించి ఈ ట్రైన్ కి జాయింట్ చేసి అమీర్పేట్ మెట్రో జంక్షన్ వరకు అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఆ మెట్రో రైలులో ప్రయాణికుల్ని దించి మరో రైలులో గమ్యస్థానాలకు చేరవేశారు. విద్యుత్ సమస్య వల్లే మెట్రో రైలు ఆగిందని అధికారులు చెబుతున్నారు. నాగోల్ - హైటెక్ సిటీ వెళ్తుండగా ఈ సమస్య తలెత్తింది. అయితే ఇప్పటికే బస్సులు లేక ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు... ఇటు మెట్రో రైలు కూడా మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లేవారు అసహనం వ్యక్తంచేశారు.

PICS : జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading