హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sixth class girl: అయ్యో తల్లి.. తోటి విద్యార్థులు హేళన చేశారని అంత పని చేశావా..?

Sixth class girl: అయ్యో తల్లి.. తోటి విద్యార్థులు హేళన చేశారని అంత పని చేశావా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు లేని ఓ ఆరేళ్ల బాలిక ఫౌండేషన్​లో ఉండటం ఇష్టం లేక మళ్లీ ఇంటికి వెళ్లాలనుకుంది. విషయం తెలిసిన తోటి విద్యార్థులు బాలికను హేళన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక చాలా కఠిన నిర్ణయం తీసుకుంది.

బుడిబుడి నడకలతో అడుగులేయాల్సిన చిన్నారి. తోటి స్నేహితులతో ఆటలాడాల్సిన బాలిక (Sixth class girl). విధి ఆడిన వింత నాటకమో ఏమో.. చిన్నతనంలోనే తండ్రిని దూరమయ్యాడు. అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లింది. ఇక నా.. అన్న వాళ్లే లేరు ఆ చిన్నారికి(Minor girl).. చివరికి ఓ ఫౌండేషన్​లో చేర్చారు దగ్గరివాళ్లు. కానీ, ఆ ఫౌండేషన్​ ఇపుడు ఆ చిన్నారి పాలిట శాపమైంది. నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆ చిన్నారిని ఆత్మహత్యకు దారి తీసింది.మేడ్చల్-మల్కాజిగిరి (Medchal malkajgiri) జిల్లా దుండిగల్​లో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక స్ఫూర్తి ఫౌండేషన్​లో ఓ మైనర్​ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​కు (Mahbubnagar) చెందిన బాలికకు చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా.. తల్లి (Mother) ఉపాధి నిమిత్తం కువైట్ (Kuwait)​కు వెళ్లింది.

బాలికను హేళన చేశారు..

అప్పటి నుంచి బాలిక తన అక్కతో కలిసి దుండిగల్​లోని స్ఫూర్తి ఫౌండేషన్​లో ఉంటూ ఆరో తరగతి చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల బాలిక 15 రోజుల పాటు తన స్వస్థలానికి వెళ్లి.. తిరిగి ఫౌండేషన్​కు చేరుకుంది. అనంతరం ఇక్కడ ఉండటం ఇష్టం లేక మళ్లీ ఇంటికి వెళ్లాలనుకుంది. విషయం తెలిసిన తోటి విద్యార్థులు బాలికను హేళన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు విషయం తెలుసుకున్న తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు ఫౌండేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చనిపోయిన విద్యార్థిని ఒంటిపై గాయాలున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవలె హైదరాబాద్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి మృతి చెందాడు. గౌలిదొడ్డిలోని ప్రభుత్వ రెసిడేన్షియల్ స్కూల్లో చదువుతున్న 16 సంవత్సరాల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన ఆత్మహత్యకు గల కారణాలను తెలిపేందుకు నాలుగు లెటర్స్‌ను రాశాడు. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో సూసైడ్ లెటర్స్ లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే..హైదారాబాద్ గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడేన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. కాగా ఆ విద్యార్థి ఉదయం ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్‌కు రాకపోవడంతో సంబంధిత అనుమానంతో అతని క్లాస్‌ రూంకు వెళ్లి చూశారు. కాగా అప్పటకే ఆ రూముకి లోపల గడియపెట్టి ఉండడడంతో బలవంతంగా పగలగొట్టి తలుపులు తెరిచి చూడడంతో ఆ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.

క్షమాపణలు చెబుతూ..

కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి వద్ద నాలుగు సూసైడ్ నోట్స్ కనిపించాయి. అందులో ఒక నోట్ మాత్రం తనపై లైంగిక వేధింపులు ఉన్నట్టు పేర్కోన్నాడు. అందుకే తాను చనిపోతున్నట్టు రాశాడు. ఈ సంధర్భంగా స్కూలు టీచర్స్‌తో పాటు కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నందుకు క్షమాపణలు చెప్పాడు.. మరో నోట్‌లో తనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు పేర్కొన్నాడు. దీంతో పాటు దేవుడు తాను అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేపోయాడు ఎందుకో అంటూ పేర్కోన్నాడు. అయితే ఆ కోరిక ఏమిటనేది వివరించలేదు. కాగా ఇదే లెటర్స్‌ను ఇంగ్లీష్‌కూడా రాసినట్టు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Minor girl, Student, Suicides

ఉత్తమ కథలు