Home /News /telangana /

SIX YEARS OLD BOY WAS DEATH BY HITTING BY STEP FATHER IN SANGAREDDY VRY MDK

Sangareddy : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !

Sangareddy : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !

Sangareddy : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !

Sangareddy : ముగ్గురు పిల్లల తల్లిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెకు పుట్టిన కొడుకుపై దారుణంగా వ్యవహరించాడు. చిన్న పిల్లవాడు అని చూడకుండా రోజంతా చిత్రహింసలు పెట్టి ఆరేళ్ల బాలున్ని కొట్టి చంపాడు.. విషయం తెలుసుకున్న తల్లి, స్థానికుల సహాకారంతో భర్తపై కేసు పెట్టింది.

ఇంకా చదవండి ...
  News 18 ప్రతినిధి
  కె.వీరన్న
  మెదక్ జిల్లా
  భర్త చనిపోయిన తర్వాత తనకు అండగా ఉంటాడని భావించిన ఓ తల్లి తనకు ముగ్గురు పిల్లలు ఉన్నా.. మరోకరిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఆ రెండో భర్త పిల్లలను నానా చిత్రహిసంలకు గురి చేశాడు. వారిని రోజు కొట్టి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. తల్లి ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళితే.. పిల్లలను ఆకారణంగా కొట్టడడం.. బెదిరించడం లాంటి సంఘటనలకు ఆ భర్త పాల్పడ్డాడు. చివరకు ముగ్గురి పిల్లల్లో ఒకరిని పొట్టన బెట్టుకున్నాడు..

  వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన ఆరుణకు... నరసింహులు అనే వ్యక్తితో తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు మగ పిల్లలు.. వారిలో మొదటి కుమారుడు జాన్ పాల్ ( 10) రెండవ కుమారుడు బస్వంత్ (8)అరుణ్ కుమార్ (6) పిల్లలు ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన భర్త నర్సింహులు లివర్ ఫెయిల్ అవడంతో సంవత్సరం క్రితం మృతి చెందాడు. అయితే తన భర్త నర్సింహులు మద్యానికి అలవాటు పడిన నేపథ్యలోనే అరుణకు
  గద్వాల్ లోని ఓ కంపనీలో పని చేస్తున్నా సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో తన భర్త నర్సింహులు మరణించిన సంవత్సరం తర్వాత తోడు కోసం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. దీంతో గత నెలలో మెదక్ సీఎస్ఐ చర్చి లో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఉపాధి కోసం పిల్లలతో సహా ఇస్నాపూర్ లోని పద్మారావు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

  ఇది చదవండి : టీఆర్ఎస్ వరంగల్ సభకు హుజూరాబాద్ ఎఫెక్ట్..? భూములు ఇవ్వమంటూ.. రైతుల వ్యతిరేకత..!


  అయితే.. వినయ్‌ చాలా రోజుల నుండి చిన్న కుమారుడు అరుణ్ పై కక్ష పెంచుకున్నాడు. చిన్న చిన్న కారణాలతో ఆరేళ్ల అరుణ్ ను తరచుగా చితకబాదేవాడు. దీంతో.. బాబు ను కొడితే తాను వెళ్లిపోతానని అరుణ పలుసార్లు హెచ్చరించినా.. వినయ్ లో మాత్రం మార్పు రాలేదు.దీంతో కట్టుకున్న భార్య అయిన అరుణ్ పై కూడా కక్ష పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే అరుణ్ గత మూడు రోజులుగా మూత్రం పోసుకుంటున్నాడనే సాకుతో మరోసారి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ వాతవరణం నెలకొంది.

  ఇది చదవండి : ఈ పండగ రోజు డబ్బులు పొగొట్టుకుంటేనే.. లక్ష్మి తిరిగి వస్తుందట.. !


  కాగా రోజులాగే నేడు భార్య ఉద్యోగానికి వెళ్లడంతో వినయ్ మరింత రెచ్చిపోయాడు. చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఆరేళ్ల పిల్లవాడిపై దారుణంగా ప్రవర్తించాడు. రోజంతా చిత్రహింసలకు గురి చేశాడు. ఉదయం నుండి కొట్టాడు. దీంతో సాయంత్రం వరకు స్పృహ తప్పేవరకు కొట్టాడు. దీంతో ఆ బాలుడు ఇంట్లోనే చనిపోయాడు. అయితే ఇదంతా చూస్తున్న ఇద్దరు పిల్లలు కూడా తమను ఎక్కడ కొడతాడో అని రోజంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి ఆరుణ్ పరిస్థితి చూసి చలించి పోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించింది.

  కాని ప్రయోజనం లేకుండా పోయింది. వినయ్ కొట్టిన దెబ్బలకు ప్రాణాలు వదిలినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇంటికి తీసుకుని వచ్చారు. కాగా బాలున్ని చితకబాదిన వినయ్ భయంతో తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలోనే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలున్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించి.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime, Medak

  తదుపరి వార్తలు