కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి

Summer Danger : ఎండాకాలం రాగానే మనమంతా కూలర్లు, ఏసీలకు పని చెబుతాం. ఐతే, వాటిని జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదమంటోంది ఈ ఘటన.

Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 5:35 AM IST
కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 4, 2019, 5:35 AM IST
ఆదిలాబాద్ జిల్లా... జైనథ్ మండలం... సిర్సన్నలో జరిగిందీ దుర్ఘటన. ఊరికి చెందిన ఆరేళ్ల పాప నీర మమత... తెల్లవారుజామున నిద్రలేచింది. పక్కన అమ్మా, నాన్నా నిద్రలో ఉన్నారు. ఆ చిన్నారికి మళ్లీ పడుకోవాలనిపించలేదు. ఎదురుగా చల్లటి గాలిని ఇస్తోంది ఎయిర్ కూలర్. అసలే ఆ ఇంట్లో వేడి ఎక్కువ. ఆ కూలర్ నుంచీ వచ్చే గాలి ఆ పాపకు బాగా నచ్చింది. అదో సరదాగా అనిపించింది. తిన్నగా వెళ్లి... కూలర్‌ను టచ్ చేసింది. అంతే... ఒక్కసారిగా హైఓల్టేజ్ కరెంటు పాసైంది. ఆ చిన్నారి గిలగిలా కొట్టుకుంటూ... క్షణాల్లో ఎగిరిపడింది. పాప అరుపులకు తల్లిదండ్రులు నిద్రలేచారు. అప్పటికే కింద పడిన పాప కొన ఊపిరితో ఉంది. తల్లిదండ్రులు తన దగ్గరకు వెళ్తుండగానే ప్రాణం విడిచింది. అంతే... ఆ తెల్లారి ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది.

ఉక్కపోత మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. అసలే ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి మనమంతా కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి. ఐతే, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈ దుర్ఘటన హెచ్చరిస్తోంది. షార్ట్ సర్క్యూట్ అయ్యి, కరెంటు పాసైందంటే... అది ప్రాణాలకే ప్రమాదమనే సంకేతాలిస్తోంది. ఏసీలు, కూలర్లను టచ్ చేసే ముందు కాళ్లకు స్లిప్పర్లు వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు.

First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...