Home /News /telangana /

SIX PEOPLE WERE KILLED WHEN A CONTAINER COLLIDED WITH AN AUTO IN KAMAREDDY DISTRICT SNR NZB

Road accident : కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లిన ఆటో .. అందరూ స్పాట్‌ డెడ్..మొత్తం ఎంతమందంటే

kamareddy road accident

kamareddy road accident

Road accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో ముందు భాగం కంటైనర్‌లోకి దూసుకుపోవడంతో మృతదేహాల్ని కూడా బయటకుతీయలేనంతగా ఇరుక్కుపోయాయి.

ఇంకా చదవండి ...
అతివేగం ఆరుగురు ప్రాణాల్ని బలిగొంది. కామారెడ్డి(Kamareddy) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road accident)లో ఆటోలో వెళ్తున్న ప్రయాణికుల్లో ఆరుగురు(Six people died) ఘటన స్తలంలోనే మృతి చెందారు. జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటో డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్ చేయడం వల్లే ఇంతటి ఘోరానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ల వివరాలు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Nagarkurnool: వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన నాగర్‌కర్నూల్, 15వ శతాబ్దం నాటి శాసనాలు గుర్తింపు 



ఆరుగురు స్పాట్‌ డెట్..
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్‌లో మృతి చెందారు. కంటైనర్ ఢీకొనడంతో ఆటో ముందు భాగం పూర్తిగా కంటేనర్‌లోపలికి దూసుకుపోవడంతో నుజ్జు నుజ్జైంది. కంటైనర్‌, ఆటోకి మధ్యలోనే ఆరుగురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. బలంగా ఢీకొట్టడంతో రెండు వాహనాల మధ్య చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసే మార్గం లేకుండా పోయింది. ప్రమాదానికి గురైన ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌ రూట్‌లో రావడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణలో తేలింది.

Telangana : వాళ్లది జన్మ జన్మల అనుబంధం ..అందుకే చావు కూడ విడదీయలేకపోయింది



మృత్యుశకటం..
రోడ్డు ప్రమాద ఘటనను స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీలో చిక్కుకొని చనిపోయిన వాళ్లను బయటకు తీయించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలు రాబడుతున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌, క్లీనర్‌కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కంటైనర్ లారీ హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు వెళ్తోంది. ఆటోలో ఉన్న వాళ్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగిలకపోవడంతో ఆటో నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసే పనిలో ఉన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Kamareddy, Road accident

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు