(K.Veeranna,News18,Medak)
దేవుడ్ని దర్శించుకొని వస్తున్న ఓ ఫ్యామిలీని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. సిద్ధిపేట్ (Siddipet)జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వేములవాడ(Vemulawada)రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి దేవుడ్ని దర్శించుకొని వస్తుండగా జగదేవ్‌పూర్(Jagadevpur)మండలం మునిగడప(Munigadapa)సమీపంలోని మల్లన్న గుడి మూల మలుపు దగ్గర కారు అదుపుతప్పి క్లిస్ కెనాల్‌లో పడిపోయింది. ఈప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి (Six people died)చెందారు. ఐదుగురు స్పాట్‌లో చనిపోగా...మరొకరు చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులు నల్గొండ(Nalgonda)జిల్లా బీబీనగర్(Bibinagar)కి చెందిన వారుగా గుర్తించారు.
ఫ్యామిలీలో అందరూ మృతి..
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ ఘోర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామ శివారు ప్రాంతంలోని మూల మలుపు దగ్గర ఓ కారు అదుపుతప్పి కెనాల్‌లో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన సమ్మయ్య, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీ,వెంకటేష్ అనే ఆరుగురు ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
కారు కాలువలో పడిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. స్పాట్‌లోనే ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా అతను కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి డెడ్ బాడీలను వారి సొంత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ కు తరలించాలని గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్ డా. సాయికిరణ్ ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.
తిరిగిరాని లోకాలకు..
కారు అదుపుతప్పి కాల్వలో పడిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని..ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు మృతి చెందడం బాధాకరమని కలెక్టర్ తెలిపారు. మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా తో కలిసి గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరిలో ఉన్న పార్టీవ దేహాలను పరిశీలించి ఆలస్యం చేయకుండా త్వరగా పోస్టుమార్టం నిర్వహించి ఉచితంగా వాహనాలను సమకూర్చి డెడ్ బాడీలను తరలించాలని సూచించారు. ఈ ఘటనపై జిల్లాకు చెందిన మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Siddipet, Telangana News