ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. స్పాట్‌లో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గర్ సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. చర్ల మండలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురనవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7.30 మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.
ఈ ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన ఆరుగురు నక్సల్స్‌లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ గ్రేహౌండ్ పోలీసుల ఆపరేషన్‌లో భాగంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. చనిపోయిన మావోయిస్టుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కాల్పులతో చర్ల మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Encounter, Latest news, Naxals, Telangana News